MLC Kavita: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును రోస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ బెయిల్పై ఈరోజు న్యాయస్థానం విచారించింది. కవిత, ఈడీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీని తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. కుమారుడుకి పరీక్షలు జరుగుతున్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్ విచారించిన కోర్టు సోమవారానికి తీర్పును రిజర్వ్ చేసింది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై మాత్రం ఏప్రిల్ 20న విచారించనుంది. కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా కవిత తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని వాదించారు.