Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ జారీ విషయంలో సుప్రీం మే 10న ఉత్తర్వులు వెలువరించనుంది. అయితే దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం ప్రాధమిక హక్కు కాదని తెలిపింది. ఎన్నికల ప్రచారం చేసే హక్కు ప్రాథమిక, రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కు కిందకు రాదు. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికైనా ఈ అవకాశం ఇవ్వలేదు.
గతంలో సమన్లు జారీ చేసినప్పుడు ఇదే కారణంతో అతను విచారణకు రాలేదన్నారు. సంవత్సరమతా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఇలా ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే ఏ రాజకీయ నాయకుడిని అరెస్టు చేయలేమని, జ్యూడిషియల్ కస్టడీలో ఉంచలేమని ఈడీ తెలిపింది. నేరాలకు పాల్పడే నేతలు ఎన్నికల ముసుగులో విచారణ నుంచి తప్పించుకునేందుకు దీని అవకాశంగా మలుచుకుంటున్నారు. రాజకీయ నాయకులు సామాన్య పౌరుల కంటే ఎక్కువ కాదని, చట్టం ముందు అందరూ సమానులే అని ఈడీ తెలిపింది.