ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టులో షరతులతో కూడిన బెయిల్ పల్లవి ప్రశాంత్ కు మంజూరు అయ్యింది. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడికి సైతం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ1 నుండి ఏ4 వరకు బెయిల్ లభించింది. పల్లవి ప్రశాంత్ ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడకూడదని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
https://twitter.com/i/status/1737588523161772381
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పోలీసులు ప్రశాంత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. బిగ్ బాస్ విన్నింగ్ మూమెంట్ తర్వాత అభిమానులు రెచ్చిపోవడానికి ప్రశాంతే కారణం అంటూ అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రశాంత్ కారణంగానే యువకులు వికృత చేష్టలకు పాల్పడినట్లు తెలిపారు.
https://twitter.com/i/status/1738170630238073026
పల్లవి ప్రశాంత్ రెచ్చగొట్టడం వల్ల దాదాపు 8 ఆర్టీసీ బస్సులను అభిమానులు ధ్వంసం చేశారని, పలువురు గాయపడినట్లు పోలీసులు రిపోర్టులో పొందుపరిచారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేందుకు భయం ఉండాలనే ఉద్దేశంతోనే పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.