Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కోర్టు బెయిల్ బాండ్‌ను అంగీకరించి కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై రూ.15000 బాండ్, రూ.లక్ష పూచీకత్తుపై అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంతకు ముందు ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌ను 8సార్లు సమన్లు చేసింది. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అతను ఈడీ కార్యాలయానికి విచారణకు వెళ్లలేదు. తాజాగా ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు, కేజ్రీవాల్ తన వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకోవాలంటూ చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తూ ఈరోజు కోర్టుకు హాజరు కావాలని కోరింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు చేరుకోగానే అక్కడ భద్రతా ఏర్పాట్లను పెంచారు. ఈ సందర్భంగా ఈడీ తరపున ఏఎస్జీ ఎస్వీ రాజు రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తన లాయర్ రమేష్ గుప్తా, పీఏ విభవ్తో కలిసి కోర్టుకు చేరుకున్నారు. ఈక్రమంలో కేజ్రీవాల్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.