»Sonia Gandhi Fever Illness Admitted To Sir Ganga Ram Hospital In Delhi
Breaking: సోనియా గాంధీ(Sonia Gandhi)కి మళ్లీ అస్వస్థత
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(76)(Sonia Gandhi) ఆరోగ్యం ఆకస్మాత్తుగా క్షీణిచడంతో ఢిల్లీ(delhi)లోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Sir Ganga Ram Hospital)లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జ్వరం(fever) కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(76)(Sonia Gandhi) ఆరోగ్యం శుక్రవారం (మార్చి 3) ఆకస్మాత్తుగా క్షీణించింది. సోనియాకు జ్వరం(fever) రావడంతో ఢిల్లీ(delhi)లోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో(Sir Ganga Ram Hospital) చేరారు. సోనియా గాంధీ ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారని, ఆమెకు వైద్య పరీక్షలు(medical tests) జరుగుతున్నాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
సోనియా గాంధీ చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్(doctor) అరూప్ బసు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇది తీవ్రమైన సమస్య కాదని, ఆమె కొంతకాలంగా శ్వాస సమస్యతో బాధపడుతున్నందున మళ్లీ ఆస్పత్రి(hospital)లో చేరినట్లు తెలిసింది. సోనియాగాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నార్మల్గా ఉందని సర్ గంగారామ్ హాస్పిటల్ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా వెల్లడించారు.
మరోవైపు సోనియా గాంధీ(Sonia Gandhi) ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా జనవరి 4న కూడా సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆమె రొటీన్ చెకప్ చేసుకున్న తర్వాత భారత్ జోడో యాత్ర(bharat jodo yatraలో పాల్గొన్నారు.