»Is The Photo Behind Rahul And Sonia Gandhi Not Of Jesus
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంట్లో జీసస్ ఫోటో వైరల్.. అసలు విషయం ఏంటంటే?
శనివారం ఆరువిడత పోలింగ్ ముసిన సందర్భంగా తల్లి సోనియాగాంధీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు రాహుల్ గాంధీ. వారు తీసుకున్న ఫోటో వెనుకాల ఓ సీనరీలో జీసస్ బొమ్మలాంటి ఆకారం దర్శనం ఇచ్చింది. దీంతో నెట్టింట్ల ఆ ఫోటో తెగ వైరల్ అయింది. రాహుల్ గాంధీ ఇంట్లో జీసస్ బొమ్మ ఏంటని రచ్చ చేశారు. ఇప్పుడు అసలు విషయం తెలిసింది.
Is the photo behind Rahul and Sonia Gandhi not of Jesus
Rahul Gandhi: దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారంతో ఆరు విడతల పోలింగ్ ముగిసింది. ఇక చివరి విడుత పోలింగ్ మిగిలుంది. ఈ సందర్భంగా ప్రత్యర్థిది ఏ చిన్న విషయం దొరికినా దాన్ని నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఫోటో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అయింది. తాను జంధ్యం ధరించే భ్రాహ్మణుడిని అని చెప్పుకునే రాహుగాంధీ ఇంట్లో జీసస్ ఫోటో దర్శనం ఇచ్చిందని నానా హంగామా చేశారు. శనివారం ఆరువిడత పోలింగ్ ముసిన సందర్భంగా తల్లి సోనియాగాంధీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు రాహుల్ గాంధీ. వారు తీసుకున్న ఫోటో వెనుకాల ఓ సీనరీలో జీసస్ బొమ్మలాంటి ఆకారం దర్శనం ఇచ్చింది. దీంతో నెట్టింట్ల ఆ ఫోటో తెగ వైరల్ అయింది. గోడకు హిందూ దేవుడి ఫొటో కాకుండా జీసస్ ఫొటో తగిలించి ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రాహుల్, సోనియా వెనకున్న గోడపై ఉన్న ఫొటో జీసస్‌ది కాదని ఫ్యాక్ట్‌చెక్‌లో తెలిసింది. అది రష్యన్ పెయింటర్ నికోలస్ రోరిచ్ వేసిన ‘మడొన్నా ఒరిఫ్లామా’ అని వెల్లడైంది. ఆ పెయింటింగ్‌లోని మహిళ పట్టుకుంది శాంతి జెండా అని నెటిజనులు కామెంట్లు కామెంట్ చేస్తున్నారు. 2017లో ఓ బ్లాగ్పోస్ట్లోనూ ఈ ఫోటోలు దర్శనం ఇచ్చాయి. దీనిని 1932లో రోరిచ్ అనే చిత్రకారుడు ఈ పటాన్ని గీశారు. దీన్ని బ్యానర్ ఆఫ్ పీస్ అని వ్యవహరిస్తారు. చూడడానికి అచ్చం జీసస్ బొమ్మల ఉండే ఈ ఆర్ట్ గ్యాలరీ న్యూయార్క్ మ్యూజియంలోనూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ అభిమానులు ఆయన హేటర్స్‌పై విరుచుకు పడ్డారు.