»Acting Opposite Varun Tej 13th Movie Ex Miss Universe Manushi Chhillar
Varun Tej: సరసన..మాజీ మిస్ యూనివర్స్ యాక్టింగ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej) ప్రస్తుతం నటిస్తున్న మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్(manushi chhillar)ను ఎంపిక చేశారు. వరుణ్ తేజ్ సినిమాతో..ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej) ప్రస్తుతం నటిస్తున్న(vt13) మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్(manushi chhillar) ను ఎంపిక చేశారు. వరుణ్ తేజ్ సినిమాతో..ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ మూవీకి సంబందించి తాజాగా చిత్ర యూనిట్ ఆమెకు వెల్ కమ్ చెబుతూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ క్రమంలో మానుషీ చిల్లర్ కూడా తన ఇన్ స్టా ఖాతాలో ఆ వీడియోను షేర్ చేసింది. అంతేకాదు కీర్తితో ఆకాశాన్ని తాకే వరుణ్ తేజ్ జట్టుతో జతకట్టడం సంతోషకరంగా ఉందని ఆమె రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు వావ్ అంటూ కామెంట్లు(comments) చేస్తున్నారు. మరికొంత మంది వెల్ కమ్ టూ తెలుగు, శుభాకాంక్షలు అంటూ పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force) బ్యాక్ డ్రాప్లో రియల్ లైఫ్ ఇన్సిడెంట్ల ఆధారంగా వస్తున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా(shakti pratap singh hada) దర్శకత్వం వహిస్తున్నారు. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, VFX అభిమాని అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ గా కనిపించనుంది.
శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రం ఈరోజు సెట్స్‌పైకి వెళ్లి తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. ‘VT13’ని సోనీ పిక్చర్స్(sony pictures) ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తైనట్లు తెలిసింది. నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ మూవీలో దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్టైనర్, భీకరమైన వైమానిక పోరాటాలతోపాటు సవాళ్లను కూడా ఈ చిత్రంలో చూపించనున్నట్లు సమాచారం.