Operation Valentine: వరుణ్ తేజ్ కోసం రంగంలోకి మెగాస్టార్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన లేటెస్ట్ ఫిల్మ్ ప్రమోషన్స్ కోసం ఎంత చేయాలో అంతకుమించి చేస్తున్నాడు. దేశమంతా చుట్టేస్తున్న వరుణ్.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపాడు.
Operation Valentine: వరుణ్ తేజ్ గత చిత్రాలు గని, గాండీవధారి అర్జున ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచాయి. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్ ఆపరేషన్ వాలెంటైన్‌తో ఎలాగైన సరే సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు మెగా ప్రిన్స్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్ తేజ్ సరసన మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ జంటగా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం వరుణ్ ఇండియా మొత్తం తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
పాన్ ఇండియా లెవల్లో వస్తున్న సినిమా కావడంతో.. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఫిబ్రవరి 25న హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటల నుండి ఈ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. ఇక్కడి నుంచి ఆపరేషన్ వాలెంటైన్ పై సాలిడ్ బజ్ జనరేట్ అవడం గ్యారెంటీ. ఇటీవల మెగాస్టార్ గెస్ట్‌గా వచ్చిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు.. ఈ సినిమా పై కూడా మంచి మెగా హైప్ రావడం పక్కా. మరి ఆపరేషన్ వాలెంటైన్ ఎలా ఉంటుందో చూడాలి.