CM Jagan : విశాఖ రాజధానిగా మారుతుంది.. మరోసారి క్లారిటీ ఇచ్చిన జగన్…!
CM Jagan : విశాఖ నగరం మరి కొద్ది రోజుల్లో రాజధానిగా మారబోతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రకటించారు. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమిట్ లో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
విశాఖ నగరం మరి కొద్ది రోజుల్లో రాజధానిగా మారబోతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రకటించారు. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమిట్ లో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉపాధి అవకాశం కలగనుందని తెలిపారు. 340 పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని, 92 MOU లు కుదుర్చుకుంటున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
ఈ రోజు, రేపు ఈ ఒప్పందాలు పూర్తవుతాయని, 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని సీఎం వెల్లడించారు. 8.54 లక్షల కోట్ల పెట్టుబడి MOUలు ఇవాళ జరుగనున్నాయని.. మిగిలిన MOUలు రేపు జరుగనున్నాయని సీఎం వెల్లడించారు.
ఇండియా గ్రోత్ స్టోరీలో ఏపీ పాత్ర కీలకంగా మారిందని సీఎం జగన్ అన్నారు. సహజ వనరులు ఏపీ ప్రత్యేకత అని సీఎం జగన్ అన్నారు. ఏపీలో రెండు పారిశ్రామిక కారిడార్లు రాష్ట్రంలో ఉన్నాయని, స్కిల్డ్ యూత్, పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏపీలో ఉందని సీఎం జగన్ తెలిపారు. ఏపీలో గ్రోత్ రేటు 11.34 శాతంగా నమోదైందని ఇది దేశంతోనే అధికమని సీఎం తెలిపారు. విశాఖలో జీ20 వర్కింగ్ కమిటీ సమావేశానికి కూడా ఏపీ ఆతిథ్యం ఇవ్వనుందనే విషయం కూడా సీఎం జగన్ గుర్తుచేశారు.