• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Kotak Mahindra: నోటి దురుసు, తన్మయ్ భట్‌ను యాడ్ నుండి తొలగించిన బ్యాంకు

దేశీయ ప్రయివేటురంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra Bank) ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్‌తో (Tanmay Bhat) వ్యాపార ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే ఆయన నోటి దురుసు కారణంగా బ్యాంకు ఆయనను తప్పించే వరకు వచ్చింది.

February 15, 2023 / 07:29 AM IST

Tongue Slip నోరుజారిన కిషన్ రెడ్డి.. రోజాను తెలంగాణ మంత్రి చేసిన వైనం

ఆర్కే రోజాను ప్రస్తావిస్తూ ‘ఇది వరకే తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక మంత్రి రోజా చెప్పారు’ అంటూ ప్రసంగిస్తుండగా అక్కడే ఉన్న అధికారులు, మీడియా ప్రతినిధులు ‘ఆంధ్రప్రదేశ్’ అని రెండు మూడుసార్లు చెప్పారు. ఈ పరిణామానికి వెంటనే తేరుకున్న కిషన్ రెడ్డి, రోజా ఇద్దరు గొల్లున నవ్వారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారందరూ నవ్వుకున్నారు. అయితే ఈ విషయమై రోజాకు వివరణ ఇస్తుండగా.. ‘పర్లేదు. కానీయండి’ అంటూ రోజా అన్నారు. అనం...

February 15, 2023 / 10:29 AM IST

Buggana Rajendranath Reddy: 3 కాదు… విశాఖ మాత్రమే రాజధాని

ఆర్థికమంత్రి మాట్లాడుతూ... మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని కాదని, అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.

February 15, 2023 / 06:53 AM IST

Anitha: పుంజు ఐతే అమర్నాథ్ తెలియదని చెబుతాడన్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు తీసుకు రావాల్సిన మంత్రి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి వనిత (Vangalapudi Anitha) ధ్వజమెత్తారు.

February 15, 2023 / 05:10 AM IST

KTR : రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో…!

KTR : హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలను మెట్రో చాలా వరకు తీర్చిందనే చెప్పాలి. మెట్రో అడుగుపెట్టిన తర్వాత ప్రయాణం కాస్త సులువుగా మారింది. కాగా... ఈ మెట్రో సదుపాయాలను మరింత పెంచుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. న‌గ‌రంలో ప్ర‌స్తుతం మెట్రో రైలు సేవ‌లు అందుబాటులోని లేని ప్రాంతాలను కూడా క‌వ‌ర్ చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీ వ‌ర‌కు కూడా మెట్రోను విస్త‌రించాల‌ని ప్...

February 14, 2023 / 06:09 PM IST

Love Birds : ఆస్పత్రిలో ఒక్కటైన జంట..!

Love Birds : ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అనుకుంటారు. జీవితంలో పెళ్లి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి.. కనీవినీ ఎరుగని రీతిలో జరుపుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. ఒక జంట మాత్రం ఆస్పత్రిలో పెళ్లి చేసుకుంది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. పెళ్లికి ముందు వధువు ప్రమాదానికి గురి కావడంతో... ఆస్పత్రిలోనే వీరు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ సంఘటన రాజస్థాన్...

February 14, 2023 / 05:48 PM IST

KA Paul : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్…!

KA Paul :కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని ఆయన కామెంట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ ఉప ఎన్నికలో మూడు లక్షల ఓట్లు ఉంటే మూడు వేల ఓట్లు పడ్డాయని, ఇక భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవదనే విషయం అందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు.

February 14, 2023 / 04:15 PM IST

Komatireddy: హంగ్, బీఆర్ఎస్-కాంగ్రెస్ దోస్తీ అంటూ సంచలనం

నల్గొండ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల అనంతరం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో కలిసి వెళ్లదని, అలాంటి సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.

February 14, 2023 / 01:51 PM IST

vangalapudi anitha: జగన్ నీకు సిగ్గనిపించడం లేదా? రిజైన్ చేస్తే దరిద్రం పోతుంది

ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి వనిత తమ పదవులకు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలి పోతుందని తెలుగు మహిళా ఆధ్యక్షురాలు వంగలపూడి అనిత మంగళవారం మండిపడ్డారు. తాడేపల్లి పరిధిలో ఓ అంధురాలిపై గంజాయి బ్యాచ్ కత్తితో దాడి చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 14, 2023 / 01:23 PM IST

Marburg Virus : మరో కొత్త వైరస్ వ్యాప్తి.. 9 మంది మృతి

కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ వైరస్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్న ప్రపంచం మరో వైరస్ తో ఉలిక్కి పడింది. ఈక్వటోరియల్ గినియాలో మార్ బర్గ్ వైరస్ (Marburg Virus) కలకలం రేపింది. ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకూ 9 మంది మరణించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంగళవారం వెల్లడించింది.

February 14, 2023 / 01:21 PM IST

Amit Shah : కోర్టుకు వెళ్లండి… కాంగ్రెస్ కి అమిత్ షా సవాలు…!

Amith Shah : కాంగ్రెస్ కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. అదానీ అంశంపై తామేదీ దాచిపెట్టే ప్రసక్తి లేదని, దీనిపై భయపడబోమని ఆయన పేర్కొన్నారు. కావాలంటే కాంగ్రెస్ కోర్టుకు కూడా వెళ్లవచ్చని ఆయన అన్నారు. పెగాసస్ అంశంపైనా మీరు ఇలాగే ఫేక్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

February 14, 2023 / 01:08 PM IST

Michigan University firing: అమెరికా వర్సిటీలో కాల్పులు, ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. మిచికాన్ స్టేట్ యూనివర్సిటీ (Michigan State University) ప్రధాన క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఓ అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది.

February 14, 2023 / 10:53 AM IST

Rahul Gandhi : నేను మాట్లాడితే మోదీకి వణుకు…

Rahul Gandhi : ప్రధాని మోదీ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లో పర్యటిస్తున్న ఆయన... అధికార పార్టీ పై మండిపడ్డారు. పార్లమెంట్ లో తాను మాట్లాడిన ప్రసంగంలో కొంత భాగాన్ని తొలగించారని ఆయన ఆరోపించారు.

February 14, 2023 / 10:47 AM IST

HD Kumaraswamy: బ్రాహ్మణులు సీఎం కావొచ్చు.. కానీ వారు మాత్రమే

జేడీఎస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కర్నాటకలో రాజకీయ దుమారం రేపాయి. దీంతో అతను తాను చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీష్వా డీఎన్ఏ ఉన్నవారు ముఖ్యమంత్రి కావొద్దని మాత్రమే తాను చెప్పానని, కానీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి కావొద్దని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

February 14, 2023 / 10:23 AM IST

Kodali Nani: షాకింగ్… జగన్ పతనం కోరుకున్న వైయస్ వివేకా

వివేకానంద రెడ్డి బతికి ఉన్నా.. చనిపోయినా తమ పార్టీ అధినేత వైయస్ జగన్ కడప లోకసభ స్థానాన్ని అవినాశ్ రెడ్డికే ఇచ్చేవారని స్పష్టం చేశారు. ఇందుకు కారణం కూడా ఉందని చెప్పారు. జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కడప ఎంపీగా, వైయస్ విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో వివేకానంద, కుటుంబం ప్రత్యర్థి పార్టీ తరఫున నిలిచారని గుర్తు చేశారు. సొంత అన్న కొడుకును, వదినను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు.

February 14, 2023 / 09:51 AM IST