»Womens Ipl Mascot Release Jay Shah Tournament Start On March 4 At Mumbai
WPL: మహిళల ఐపీఎల్ మస్కట్ రిలీజ్..మార్చి 4న టోర్నీ షూరూ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మహిళల క్రికెట్ దశ దిశను మార్చబోతున్న మెగా టోర్నీ. 2023లోనే ఈ టోర్నీ తొలిసారి జరగబోతోంది. ఇప్పటికే మీడియా హక్కులు, ఫ్రాంఛైజీల కోసం వేసిన బిడ్లలో ఈ లీగ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో మహిళల ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్(WPL) మస్కట్ 'శక్తి'ని బీసీసీఐ సెక్రటరీ జే షా(jay shah) గురువారం ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇక ఈ టోర్నీ మార్చి 4న ముంబయిలో ప్రారంభం కానుంది.
మహిళల ఐపీఎల్(women ipl) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు(cricket fans) గుడ్ న్యూస్. మరో రెండు రోజుల్లో ఈ టోర్నీ మొదలు కానుంది. ఈ క్రమంలో తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్(WPL) మస్కట్ ‘శక్తి’ని బీసీసీఐ(bcci)సెక్రటరీ జే షా(jay shah) గురువారం ఆవిష్కరిస్తూ సోషల్ మీడియా(social media) వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఓ కార్టూన్ మహిళా వేగంగా వస్తున్న బంతులను బ్యాట్ పగిలేలా కొట్టి.. పరుగులు తీయడం చూడవచ్చు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(women premier league) తొలి మ్యాచ్ మార్చి 4న నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మొదలు కానుంది. ఈ లీగ్ మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరగనుందని ఇప్పటికే ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్(arun dhumal) వెల్లడించారు. మరోవైపు ఐదు జట్లకు గాను BCCI మీడియా హక్కులను రూ.951 కోట్లకు విక్రయించడంతో WPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద T20 లీగ్ గా ఇది నిలిచింది.
#WATCH | BCCI Secretary Jay Shah introduces the mascot of Women's Premier League, 'Shakti'.
ఈ ఎడిషన్‌లో ఐదు జట్లు ఉండగా వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్(gujarat giants), ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, యూపీ వారియోర్జ్ ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ సర్క్యూట్లో వీరు అత్యుత్తమ ప్రతిభను కనబర్చడానికి ఇది ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. మహిళల జట్టు కోసం కొత్తగా ఏర్పడిన కోచింగ్ టీమ్‌లో షార్లెట్ ఎడ్వర్డ్స్ (హెడ్ కోచ్), ఝులన్ గోస్వామి (టీమ్ మెంటార్, బౌలింగ్ కోచ్), దేవికా పల్షికార్ (బ్యాటింగ్ కోచ్) ఉన్నారు. మొదటి సీజన్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(women premier league)లో మొత్తం 20 మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిలో రెండు ప్లేఆఫ్ గేమ్‌లతో సహా 23 రోజుల వ్యవధిలో ఆడనున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ మ్యాచ్ మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది.
భారత క్రీడాకారిణి స్మృతి మంధాన(smriti mandhana)ను అత్యధికంగా 3.40 కోట్ల రూపాయలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కొనుగోలు చేసింది. టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(harmanpreet kaur)ను ముంబై ఇండియన్స్ రూ.1.80 కోట్లకు దక్కించుకుంది. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆటగాళ్లు కూడా ఐదు ఫ్రాంచైజీలలో భాగంగా ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ నటాలీ స్కివర్లు వరుసగా INR 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు కొనుగోలు చేశాయి. మరోవైపు ఇండియా U19 స్టార్స్ నుంచి ICC U19 T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్, షఫాలీ వర్మను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది.