»Cheating Case Registered Against Shah Rukhs Wife Gauri Khan Plot Fraud Mumbai
Gauri Khan: షారూఖ్ భార్యపై చీటింగ్ కేసు నమోదు..ప్లాట్ విషయంలో మోసం!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్(Gauri Khan)పై ముంబయిలో చీటింగ్ కేసు(cheating case) నమోదైంది. ఓ వ్యక్తి తాను ప్లాట్ కోసం 86 లక్షలు చెల్లించినప్పటికీ చెప్పిన ప్రకారం ప్లాట్ అందించలేదని ఓ రియల్ ఎస్టేట్ సంస్థతోపాటు ప్రచారం చేసిన గౌరీ ఖాన్ పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) భార్య గౌరీ ఖాన్(Gauri Khan) పై చీటింగ్ కేసు(cheating case) నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. ఓ ప్లాట్ విషయంలో(Plot fraud) గౌరిఖాన్ తనను మోసం చేశారని ముంబయి(mumbai)కి చెందిన వ్యక్తి పోలీసు(police)లకు ఫిర్యాదు చేశాడు. అయితే గౌరీ ఖాన్ ఉత్తరప్రదేశ్ లక్నోలోని తులసియాని అపార్ట్మెంట్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఆ క్రమంలో లక్నోలో ఓ అపార్ట్మెంట్ కోసం తన నుంచి ఈ సంస్థ. 86 లక్షల రూపాయలు తీసుకుందని..2016లో తనకు ఇచ్చిన హామీ మేరకు ప్లాట్ అప్పగించలేదని జస్వంత్ షా(Jaswant Shah) ఆరోపించారు.
అయితే జస్వంత్ షా(Jaswant Shah) తనకు ప్లాట్ ఎందుకు ఇవ్వడం లేదని తెలుసుకోగా..అది మరొకరికి అమ్మినట్లు తేలింది. మరోవైపు ఆ ప్లాట్ కోసం ఇతను బ్యాంక్ నుంచి 85 లక్షల రూపాయలు అప్పు చేసినట్లు పేర్కొన్నాడు. దీంతో తనకు ప్లాట్ దక్కకపోగా తప్పుడు ప్రచారం చేయడం వల్ల తాను నష్టపోయానని(loss) వాపోయాడు.
ఆ క్రమంలో అతను తులసియాని కన్స్ట్రక్షన్(Tulsiani Group) మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్, డైరెక్టర్ మహేష్ తులసియాని, గౌరీ ఖాన్‌లపై లక్నో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒప్పంద ఉల్లంఘనకు గౌరీ ఖాన్ కూడా కారణమని ఆయన ఆరోపించారు. గౌరీ ఖాన్ ప్రాజెక్ట్ గురించి చెప్పినందున 2015లో ఆ ప్రకటనకు ప్రభావితమైన అపార్ట్మెంట్(apartment)ను కొనుగోలు చేసినట్లు షా ఫిర్యాదు(complaint)లో పేర్కొన్నాడు. దీంతో పలు సెక్షన్ల ప్రకారం పోలీసులు(police) కేసు(case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంకోవైపు గౌరీఖాన్ భర్త షారూఖ్ ఖాన్ యాక్ట్ చేసిన “పఠాన్”(pathan) మూవీ(movie) బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్ల మార్క్‌ను అధిగమించింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ కేసులో ఇరుక్కోవడం పట్ల షారూఖ్ అభిమానులు(fans) ఆవేదన చెందుతున్నారు.