Amit Shah: A case has been registered against those who shared Amit Shah's fake video!
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కేంద్ర హఓం మంత్రిత్వ శాఖ, బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఫేక్ వీడియోలు చేసిన వాళ్లపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేయడం గురించి అమిత్ షా ఆ వీడియోలో మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ను అంతం చేసేందుకు బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు వీడియో షేర్ చేశారు. ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని పిటిషన్లో ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా మాట్లాడలేదని బీజేపీ తెలిపింది.
ఈ వీడియో ఫేక్ అని, ఇది పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉందని బీజేపీ ఆరోపించింది. వెంటనే వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ల నుంచి డిలీట్ చేయాలని కోరారు. ఇటీవల అమిత్ షా తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ ఓబీసీలకు చెందిన హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని తెలిపారు. దీన్ని కొంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ను రద్దు చేస్తామని చెబుతున్నట్లు ఎడిట్ చేశారు. ఇలా చేసిన వాళ్లకు చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.