నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) గురువారం రిలయన్స్ క్యాపిటల్(Reliance Capital) రుణదాతలు దాఖలు చేసిన పిటీషన్‌ను మరోసారి అనుమతి ఇచ్చింది. దివాలా ప్రక్రియలో భాగంగా రుణంలో చిక్కుకున్న సంస్థ కోసం మరో రౌండ్ వేలం వేయాలని పేర్కొంది. మరోవైపు ఈ సంస్థపై మరిన్ని చర్యలు చేపట్టకుండా ఉండేందుకు ఇద్దరు సభ్యుల బెంచ్ జారీ చేసిన ఉత్తర్వును పక్కన పెట్టింది. దివాలా పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ఆస్తుల(assets)కు అధిక విలువ తెచ్చే క్రమంలో చర్చలు జరిపేందుకు కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (COC)కి అధికారం ఉందని వెల్లడించింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ రెండు వారాల తర్వాత సెకండ్ ఛాలెంజ్ మెకానిజంను కొనసాగించడానికి, బిడ్లను ఆహ్వానించడానికి COCని అనుమతించింది.
అనిల్ అంబానీ ప్రమోట్ చేసిన రిలయన్స్ క్యాపిటల్(Reliance Capital) రుణదాతలలో ఒకరైన విస్ట్రా ITCL (ఇండియా) దాఖలు చేసిన పిటిషన్‌పై NCLAT ఆర్డర్ వచ్చింది. ఇది దివాలా తీసిన సంస్థ యొక్క తదుపరి వేలాన్ని పరిమితం చేసిన NCLT ఆర్డర్‌ను సవాలు చేసింది. ఇక రిలయన్స్ క్యాపిటల్ (RCap) విషయంలో టొరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.8,640 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌తో అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది.