ELR: నూజివీడు(మం) జంగంగూడెంలో బుధవారం 60 లక్షల రూపాయల వ్యయంతో సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పొట్లూరి అంజనాదేవి అశోక్, మండల టీడీపీ అధ్యక్షులు యనమదల వాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి పార్థసారథి సహకారంతో గ్రామాలు పురోభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. కూటమిపాలనతో గ్రామాలలో వేగంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు.