కృష్ణా: అవనిగడ్డలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను మంగళవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించారు. హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యత స్వయంగా పరిశీలించారు. ఆహారం నాణ్యత ఎలా ఉంటోంది? అని ఎమ్మెల్యే విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.