»Bank Employees To Work 5 Days A Week With Longer Duty Hours
5 day week for bank staff: త్వరలో.. బ్యాంకులు 5 రోజులే పని చేస్తాయ్
దేశంలో ప్రస్తుతం ఎక్కువ బ్యాంకులు వారానికి (Bank working days) ఐదు నుండి ఆరు రోజులు పని చేస్తున్నాయి. రెండో, నాలుగో శనివారాలు ఉన్న రోజుల్లో ఐదు రోజులు, మిగతా రెండు వారాల్లో ఆరు రోజులు పని చేస్తాయి. అయితే త్వరలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశంలో ప్రస్తుతం ఎక్కువ బ్యాంకులు వారానికి (Bank working days) ఐదు నుండి ఆరు రోజులు పని చేస్తున్నాయి. రెండో, నాలుగో శనివారాలు ఉన్న రోజుల్లో ఐదు రోజులు, మిగతా రెండు వారాల్లో ఆరు రోజులు పని చేస్తాయి. అయితే త్వరలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారానికి ఐదు రోజులు అన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని ఐబీఐ (IBA-Indian Banks Association) పరిగణలోకి తీసుకున్నది. వారానికి ఐదు రోజులే బ్యాంకులు పని చేయాలనే ఉద్యోగుల డిమాండును పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే అప్పుడు ఉద్యోగులు వర్కింగ్ డేస్లో అంటే మిగిలిన ఐదు రోజుల్లో… రోజుకు 50 నిమిషాలు ఎక్కువగా పని చేయవలసి ఉంటుంది. IBA-యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (United Forum of Bank Employees-UFBE) ఈ విషయమై చర్చలు సాగుతున్నాయి.
కొత్త విధానం అమల్లోకి వస్తే ఇకపై అన్ని శని వారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. అదే సమయంలో ప్రతి రోజూ ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనివేళలు ఉండే అవకాశాలు ఉన్నాయి. 50 నిమిషాలు కాకపోయినా 40 నిమిషాలు పని సమయం పెంచవచ్చును. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (All India Bank Officers’ Association) జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజన్ మాట్లాడుతూ… నెగోషబల్ ఇన్స్ట్రుమెంటస్ యాక్ట్ సెక్షన్ 25 కింద ప్రభుత్వం అన్ని శనివారాలు కూడా సెలవు రోజుగా ప్రకటించవచ్చునని చెప్పారు.