తెలుగు దేశం (Telugu Desam), జనసేన (Janasena) పార్టీలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (anil kumar yadav) సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (andhra pradesh assembly elections 2024) జనసేనానికి పవన్ కళ్యాణ్ కు (Janasena chief Pawan Kalyan), తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)కు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
తెలుగు దేశం (Telugu Desam), జనసేన (Janasena) పార్టీలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (anil kumar yadav) సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (andhra pradesh assembly elections 2024) జనసేనానికి పవన్ కళ్యాణ్ కు (Janasena chief Pawan Kalyan), తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)కు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. నారా లోకేష్ కు దమ్ముంటే తన యువ గళం (Yuva Galam) పాదయాత్ర సందర్భంగా టీడీపీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన పాదయాత్ర పూర్తయ్యేలోపు వారి పార్టీ తడిగుడ్డ వేసుకొని ఇంట్లో కూర్చుకుంటుందని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలవడం మాట పక్కన పెడితే, కనీసం మేజిక్ ఫిగర్ స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారా… పోటీ చేయగలరా అని ఎద్దేవా చేశారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా లేని టీడీపీ, జనసేనలు తమ పార్టీ (YSRCP) గురించి, తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తాము ధైర్యంగా చెప్పగలుగుతున్నామని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. జగన్ కూడా ఇదే విషయం చెప్పారని గుర్తు చేశారు. వైసీపీకి ఎలాంటి పొత్తులు అవసరం లేదన్నారు. మేం సింగిల్ గా పోటీ చేసి, 175 స్థానాల్లో గెలుస్తామన్నారు. టీడీపీ, జనసేనలకు మాత్రం ఆ సత్తా లేదన్నారు.
ముఖ్యమంత్రి జగన్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారన్నారు. ఉద్యోగాల్లో తమ హయాంలో వచ్చిన అవకాశాలు గత తెలుగుదేశం పార్టీ హయాం కంటే ఎక్కువే అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయులు, పట్టభద్రుల అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారన్నారు. ఓటర్లు తమ వైపే ఉన్నారని చెప్పారు. తమ పార్టీ వారిని ధైర్యంగా ప్రజల్లోకి పంపించే ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అన్ని హామీలు నిలబెట్టుకుంటున్నాం కాబట్టి ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లగలుగుతున్నామని చెప్పారు. లోకేష్, పవన్ కళ్యాణ్ లకు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలన్నారు. ఆయన నెల్లూరు లోని సిటీ వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.