Adimulapu Suresh : రాజధానిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ రాజధానిగా మారబోతోందంటూ ఆయన పేర్కొన్నారు. అయితే... పూర్తి స్థాయి రాజధానిగా మారుతుందా అని విలేఖరులు ప్రశ్నించగా.. ఆయన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
రాజధానిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ రాజధానిగా మారబోతోందంటూ ఆయన పేర్కొన్నారు. అయితే… పూర్తి స్థాయి రాజధానిగా మారుతుందా అని విలేఖరులు ప్రశ్నించగా.. ఆయన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
ఇంతకీ మ్యాటరేంటంటే….జి-20 ఏర్పాట్ల కోసం జరుగుతోన్న బీచ్‌ల సుందరీకరణ పనులను మున్సిపల్ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. ఎమ్జీఎమ్ పార్క్‌లో రేపు సీఎం జగన్ పాల్గొనబోయే విందు సమావేశపు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చే అతిథులతో రేపు రాత్రి ఎంజీఎం పార్కులో విందు ఏర్పాటు చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. విశాఖ రాజధాని కాబోతోందంటూ చెప్పి నాలుక కరుచుకున్నారు. పూర్తిస్ధాయి రాజధానా? అని అడిగేసరికి ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష ఏదైతే అది అని దాటవేసే ప్రయత్నం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ తమ లక్ష్యం అంటూనే..3 రాజధానులు అంశంపై మంత్రి మాటల్లో స్పష్టత కొరవడింది.