తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో తిరుమల(Tirumala)కు భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రి నుంచే భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో ఆదివారం భక్తులతో కొండపై ఉన్న కంపార్టెమెంట్లన్నీ నిండిపోయాయి.
ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నప్పటికీ ఎవరు కూడా మాతృభాషను విస్మరించకూడదని వెంకయ్య నాయుడు సూచించారు.
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవమైనట్లు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అతన్ని అభినందించారు.
తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధీలో ఈనెలలోనే 1,500 ఆశా పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
హీరో రాం చరణ్ పై తన భార్య ఉపాసన రివేంజ్ తీర్చుకుందా. ఈ వీడియో చూస్తే మాత్రం అచ్చం అలాగే అనిపిస్తుంది. కానీ అసలు విషయం తెలియాంటే ఈ స్టోరీని ఓసారి చదవండి.
ఏపీకి కొత్త గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ కు బదిలీ అయ్యారు. దీంతోపాటు 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటించారు.
మీకెప్పుడైనా పెళ్లి కావాలని పాదయాత్ర చేస్తున్నారనే వార్త తెలుసా? అవును మీరు విన్నది నిజమే. కర్ణాటక మాండ్యా జిల్లాలో దాదాపు 250 మంది యువకులు తమకు వధువు కావాలని ఫిబ్రవరి 23న పాదయాత్ర చేయనున్నారు. 106 కిలోమీటర్లు ప్రయాణించి శైవక్షేత్రమైన మలే మహదేశ్వర కొండల వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
నందమూరి తారకరత్న(39) ఆరోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యుడు రామకృష్ణ అప్ డేట్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లకుండా బెంగళూరులోనే ఫారెన్ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు వివరించారు.
ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలను ప్రకటించిన సీఎం కేసీఆర్..ఈ ఆలయ అభివృద్ధి పనుల రూపకల్పన, పరిశీలన కోసం ఈనెల 14న కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు.
యాదగిరిగుట్ట నుండి తిరుపతి వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు వనపర్తి జిల్లాలోని కొత్తకోట వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో పదిహేను మంది గాయపడ్డారు.
తిరుపతి వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు(TSRTC Bus) 44వ జాతీయ రాహదారి పరిధిలో పల్టీ కొట్టింది. ఘటనలో సుమారు 15 మందికి గాయాలు కాగా, ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినీ( Viḍudala rajinī) గురించి సోషల్ మీడియలో ఒక ఆసక్తికర వార్తా చక్కర్లు కొడుతొంది. అదేంటంటే ..ఆమె సినిమా ఇండస్ట్రీలోకి( Film industry) ఎంట్రీ ఇవ్వనున్నారట.
గుజరాత్ లోని సూరల్ జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూపంకం(Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైనట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (Institute of Seismological Research-ISR) అధికారులు తెలిపారు.
గూగుల్ సాయంతో గుట్టు చప్పుడు కాకుండా కొన్ని సంవత్సరాలుగా వైద్యం చేస్తున్న ఫేక్ వైద్యుడు సెంబియన్(31)ని తమిళనాడులో అరెస్టు చేశారు. ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదవిన సెంబియన్ తన పేరుమీద ఉన్న నిజమైన డాక్టర్ ప్రొఫెల్ మార్చి డాక్టర్ గా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలోనే రెండు సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. అప్పుడు కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి అనేక కేసులకు సంబంధించిన పత్రాలు దహనమయ్యాయి. అప్పుడు ఆ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. తాజాగా జరిగిన ప్రమాదంలో మరికొన్ని పత్రాలు మంటల్లో కాలిపోయాయి. ఏ పత్రాలు తగలబడ్డాయో ఇంకా తెలియరాలేదు.