»Sensational Things Come Out In The Saif Remand Report On Preethi Suicide Case
Preethi Suicide Case: సైఫ్ రిమాండ్ రిపోర్టులో వెలుగులోకి సంచలన విషయాలు
కేఎంసీ మెడికల్ విద్యార్థిని ప్రీతి మృతి కేసులో పోలీసుల అదుపులో ఉన్న సైఫ్ రిమాండ్ లో భాగంగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. రెండు కారణాల నేపథ్యంలో అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న సూపర్ వైజర్ సైఫ్..ప్రీతిపై కోపం పెంచుకున్నట్లు తెలిసింది. ఓ యాక్సిడెంట్ రిపోర్టు సహా తనపై హెచ్ఓడీకి ఫిర్యాదు చేసినందుకు సైఫ్ ఆమెపై కోపంతో ఉన్నాడని రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తోంది.
వరంగల్ కేఎంసీ మెడికల్ విద్యార్థిని ప్రీతి మృతి కేసు(preethi suicide case)లో పోలీసుల అదుపులో ఉన్న సైఫ్(saif) రిమాండ్(remand ) లో భాగంగా కీలక విషయాలను అధికారులు వెల్లడించారు. రెండు అంశాల కారణంగా అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న సూపర్ వైజర్(supervisor) సైఫ్.. ప్రీతిపై కోపం పెంచుకున్నట్లు ఈ రిపోర్టు(report) ద్వారా తెలిసింది. గత ఏడాది డిసెంబర్లో ఓ యాక్సిడెంట్(accident) కేసు విషయంలో ప్రీతికి సైఫ్ సూచనలు ఇవ్వగా..ఆమె ప్రిలిమినరీ రిపోర్టును రాసింది. కానీ ఆ రిపోర్టు సరిగా రాయకపోవడంతో ప్రీతి రాసిన కాపీని వాట్సాప్ గ్రూపులో పెట్టి సైఫ్ ఆమెను కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లో ఉచితంగా సీటు(free seat) పొందితే ఇలాగే ఉంటుందని అవమానించినట్లు సమాచారం. ఆ క్రమంలో వీరిద్దరికి వాట్సాప్లో(whatsapp) వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ నేపథ్యంలో తనతో ఏదైనా ఇబ్బంది ఉంటే హెచ్ఓడీ(HOD)కి చెప్పుకోవాలని ప్రీతి సైఫ్ కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
దీంతో కోపం పెంచుకున్న సైఫ్(saif) అదే విభాగంలో పనిచేస్తున్న తన స్నేహితుడు బార్గవ్ కు ప్రీతిని వేధించాలని కోరినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ప్రీతికి ఎక్కువ సమయం డ్యూటీ వేయాలని సైఫ్ అతన్ని కోరాడు. ఇదే అంశంపై గత నెల 21న హెచ్ఓడీ(HOD) నాగార్జునకు కూడా ప్రీతి కంప్లైంట్(complaint) చేసింది. దీంతో డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని ఆధ్వర్యంలో ప్రీతి, సైఫ్ కు వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత రోజే ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తంగా సైఫ్ మొబైల్ నుంచి ప్రీతికి 17 వాట్సాప్ చాటింగ్(chatting)లు వెళ్లాయని అధికారులు పేర్కొన్నారు.
జనగామ జిల్లాలోని కొడకొండ్ల మండలం గిర్నితండాకు చెందిన మెడికో విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తన సీనియర్ సైఫ్ (Saif) వేధింపుల కారణంగా బలైన విషయం తెలిసిందే. ఆమె మృతిని ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ప్రీతి (Preethi) ధైర్యవంతురాలు. సైఫ్ వంటి వారు వేధిస్తే మిగతా జూనియర్లు భయపడి మౌనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ప్రీతి వారిని నిలదీయడంతో, సైఫ్ (Saif) టార్గెట్ చేశాడు. ఇదే విషయం ప్రీతి తల్లిదండ్రుల(parents)కు కూడా తన బాధను చెప్పుకుంది. యాజమాన్యంతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ, నిందితుడి తీరు మారలేదు. ఇలాంటి తరుణంలో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసి, ఐదు రోజుల పాటు హాస్పిటల్ లో చికిత్స పొంది, చివరకు కన్నుమూశారు. అయితే తన కూతురు అంత భయస్తురాలు కాదని, ఆమె ఆత్మహత్యాయత్నం చేయదని, ఎవరో బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చి ఉంటారని, సైఫ్ ను పూర్తిగా విచారిస్తే తేలుతుందని తల్లిదండ్రులు అంటున్నారు.
నైట్ డ్యూటీలో, తన చెల్లిని హైదరాబాద్ తరలించినప్పుడు ఏం జరిగిందో తెలియాలని ప్రీతి (Preethi) సోదరి డిమాండ్ చేశారు. తోటి డాక్టర్లను (Doctor) లేదా విద్యార్థులను వేధించేవారు సమాజానికి ఏం మేలు చేస్తారని ఆమె నిలదీశారు. వేధింపులకు పాల్పడిన నిందితుడు సైఫ్ ను (Saif) కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.