»Kavitha Key Person In Delhi Liquor Case Ed In Remand Report
ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత కీలక వ్యక్తి
సౌత్ లాబీ పేరుతో కవిత ఈ లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వడంలో కవిత పాత్ర ఉన్నట్లు అందులో పేర్కొంది.
Kavitha key person in Delhi liquor case: ED in remand report
ED: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) కీలక వ్యక్తి అని, సౌత్ లాబీ పేరుతో లిక్కర్ కేసులో ఆమె కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో ఈడీ(ED) పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వడంలో కవితనే కీలక సూత్రధారి అని అందులో తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో రామచంద్రపిళ్లై కవితకు బినామీగా వ్యవహరించినట్లు పేర్కొంది. మొత్తం మనీ ల్యాండరింగ్ అంతా రామచంద్రపిళ్లై ద్వారా నడిపినట్లు ఈడీ వెల్లడించింది. దీనిలో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఢిల్లీకి రూ.30 కోట్లను కవిత పంపించిందని పేర్కొంది. వాటినిక అభిషేక్ బోయినపల్లి ఢిల్లీలో అందుకున్నారు అని పేర్కొంది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో ఒప్పందం కుదుర్చుకున్న కవిత ఈ మొత్తం వ్యవహారాన్ని తన బినామీల ద్వారా నడిపించినట్లు ఈడీ పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం దీనికి పూర్తి మద్దతు ఇచ్చిందని దానికి గాను రూ. 100 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అలాగే అరుణ్ పిల్ళై పేరుతో ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటాలను పొందినట్లు రిమాండ్‌లో ఈడీ తెలిపింది. గతంలో ఈడీ విచారణకు హాజరయిన కవిత తన మొబైల్ ఫోన్లోని ఆధారాలను తొలగించినట్లు వెల్లడించింది. సౌత్ గ్రూప్‌లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవలతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో ఈ వ్యవహారాన్ని కవిత నడిపినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది.