భారత్లో సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఏఏ అమలు చేస్తే ముస్లింల ఉనికే ప్రశ్నార్థకమవుతుందని స్టే ఇవ్వాలంటూ పిటిషన్లో కోరారు.
Implementation of CAA.. A threat to existence as a Muslim.. Asaduddin Owaisi went to the Supreme Court
Asaduddin Owaisi: భారత్లో సీఏఏ(CAA) అమలును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్ఐఎమ్(MIM) పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ(Asaduddin Owaisi). పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్ లో ప్రవేశించిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన, పార్శీ ప్రజలకు భారత పౌరసత్వాన్ని అందించే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిలిపివేయాలంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
సీఏఏ అమలుకు స్టే ఇవ్వాలంటూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సీఏఏని ఎన్పీఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్), ఎన్ఆర్ సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్)తో కలిపి చూడాలని పేర్కొన్నారు. అయితే ఇతర దేశాల నుంచి వచ్చే హిందువులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి తనకేమి అభ్యంతరం లేదని అన్నారు. కానీ భవిష్యత్తులో ఎన్పీఆర్, ఎన్ఆర్సీ అమలు చేస్తే దేశంలో ఉన్న 17 కోట్ల మంది ముస్లింల ఉనికి ప్రశ్నార్థకమవుతుందని తెలిపారు. వారికంటూ సొంత దేశం ఉండదని అన్నారు. ఓ ప్రాంతం ఆధారంగా చట్టాలు చేయవద్దని, గతంలో కూడా ఇలాంటి విషయంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చిందని వెల్లడించారు. సీఏఏకిి వ్యతిరేకంగా ఓటు వేసి హైదరాబాద్ ప్రజలు బీజేపీని ఓడిస్తారని ఓవైసీ తెలిపారు.