తాను సీనియర్ ను కాబట్టి ప్రీతిని వృత్తిరీత్యా పొరపాట్లు చేయడంతో తాను తప్పని చెప్పాను కానీ, ర్యాగింగ్ చేయలేదని, ఆమెను గైడ్ చేయాలనుకున్నానని తొలుత నమ్మించే ప్రయత్నం చేసిన సైఫ్, ఆ తర్వాత పోలీసులు ఆధారాలతో రావడంతో ఎట్టకేలకు ర్యాగింగ్ (ragging in college) చేసినట్లుగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
వరంగల్ మెడికో (Warangal Medico) ప్రీతి నాయక్ (Preethi Nayak)ను తాను వేధించినట్లు సీనియర్ విద్యార్థి సైఫ్ (Saif) ఎట్టకేలకు పోలీసుల (Police) ఎదుట అంగీకరించినట్లుగా తెలుస్తోంది. గత నెల ఫిబ్రవరి 22వ తేదీన అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రీతిని (Preethi) వెంటనే వరంగల్ ఎంజీఎం (Warangal MGM) నుండి హైదరాబాద్ లోని (Hyderabad) నిమ్స్ కు (NIMS) తరలించారు. ఐదు రోజుల పాటు చికిత్స అనంతరం ఫిబ్రవరి 26వ తేదీన మెడికో (Medico Preethi) తుది శ్వాస విడిచారు. ప్రీతిని (Dr Daravath Preethi) సైఫ్ (Saif) ర్యాగింగ్ చేసి, తీవ్రంగా వేధించినందు వల్లే ఆమె చనిపోయారనే వాదనలు వినిపించాయి. అయితే ప్రీతిది ఆత్మహత్య (Suicide) కాదని, హత్య (murder) అని, సైఫ్ హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రీతి కేసులో పోలీసులు… సైఫ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కానీ తాను ర్యాగింగ్ చేయలేదని ఆయన నమ్మబలుకుతూ వచ్చాడు. తాను సీనియర్ ను కాబట్టి ఆమె వృత్తిరీత్యా పొరపాట్లు చేయడంతో తాను తప్పని చెప్పాను కానీ, ర్యాగింగ్ చేయలేదని, ఆమెను గైడ్ చేయాలనుకున్నానని తొలుత నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ సెల్ ఫోన్ ( Cell Phone), వాట్సాప్ చాటింగ్ (whatsapp chatting) సహా వివిధ ఆధారాలతో పోలీసులు అతని ముందుకు వెళ్లగా, ఎట్టకేలకు ర్యాగింగ్ (ragging in college) చేసినట్లుగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
పోలీసులు అతనిని నాలుగు రోజుల పాటు విచారించారు. అన్ని ఆధారాలను సమీకరించి, వాటిని అతని ముందు పెట్టారు. దీంతో ర్యాగింగ్ పాల్పడిన మాట నిజమేనని అంగీకరించాడు. చాటింగ్ సందర్భంగా కూడా వేధించినట్లు చెప్పాడు. అతని కస్టడీ మార్చి 6వ తేదీన ముగిసింది. పోలీసులు నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టి, కన్సెషన్ రిపోర్టులో పలు విషయాలను పేర్కొన్నారు.
మరోవైపు, ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ (Toxicology report of Dr Preethi) వచ్చింది. ఆమె శరీరంలో ఎలాంటి విష పదార్థాలు కనిపించలేదని ఇందులో పేర్కొన్నట్లుగా సమాచారం. విష రసాయనాల ఆనవాళ్లు లేవని టాక్సికాలజీ రిపోర్ట్ చెబుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోను ఎలాంటి రసాయనాలు దొరకలేదని నివేదికలో తేలిందని తెలుస్తోంది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ వరంగల్ సీపీ రంగనాథ్ చేతికి వచ్చింది. ఈ టాక్సికాలజీ రిపోర్ట్ నేపథ్యంలో ప్రీతి మృతి కేసును ఆత్మహత్య కేసు నుండి అనుమానాస్పద మృతి కిందకు మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ప్రీతిది ముమ్మాటికి హత్యేనని కుటుంబ సభ్యులు మొదటి నుండి చెబుతున్నారు. ఆమె మృతి సమయంలోను, ఆ తర్వాత పలుమార్లు తల్లిదండ్రులు, సోదరుడు వంశీ.. ప్రీతిని హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.
డాక్టర్ ప్రీతి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో (Kakatiya Medical College, Warangal) ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని. సైఫ్ అనే సీనియర్ విద్యార్థి ఆమెను రెండు మూడు నెలలుగా వేధించాడు. ర్యాగింగ్ చేయడాన్ని ఆమె గట్టిగా ప్రశ్నించింది. దీంతో కక్ష పెంచుకున్న సైఫ్ ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకుందని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, టాక్సికాలజీ రిపోర్ట్ అనంతరం ఆమె కుటుంబ సభ్యుల అనుమానం మరింతగా బలపడుతోంది.