»Kcr Government Is Trying To Protect The Accused In The Preeti Case
preethi case నిందితులను రక్షించే ప్రయత్నం: బండి సంజయ్
Bandi sanjay on preethi case:మెడికో ప్రీతి (preethi) మృతి కేసు నిందితులను తెలంగాణ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ఆరోపించారు. పథకం ప్రకారమే కేసీఆర్ (kcr government) ప్రభుత్వం ఈ కేసును (case) నీరుగారుస్తోందని తెలిపారు. సీఎంవో (cmo) నుంచి ఆదేశాల మేరకు పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
KCR government is trying to protect the accused in the Preeti case
Bandi sanjay on preethi case:మెడికో ప్రీతి (preethi) మృతి కేసు నిందితులను తెలంగాణ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ఆరోపించారు. పథకం ప్రకారమే కేసీఆర్ (kcr government) ప్రభుత్వం ఈ కేసును (case) నీరుగారుస్తోందని తెలిపారు. సీఎంవో (cmo) నుంచి ఆదేశాల మేరకు పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రీతి ఎలా చనిపోయిందో ఇప్పటివరకు వైద్యులు చెప్పలేదన్నారు. ప్రీతి కేసు గురించి సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు.
ప్రీతి (preethi) మృతి కేసును సిట్టింగ్ జడ్జీతో (sitting judge) విచారణ జరిపించాలని బండి సంజయ్ (bandi sanjay) డిమాండ్ చేశారు. కడసారి చూపు కూడా దక్కకుండా బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారని మండిపడ్డారు. మహిళల రక్షణ గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం (brs government) పట్టించుకోవడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
బీజేపీ మహిళా నేత డీకే అరుణ (dk aruna) కూడా ఇదే అంశంపై మాట్లాడారు. సీఎం కేసీఆర్కు (kcr) మహిళలు అంటే గౌరవం లేదని ఫైరయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రీతి అంశంలో నిజనిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. క్రిమినల్ కేసుల్లో ఉన్న మంత్రుల కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని ఫైరయ్యారు. ప్రభుత్వం అండగా ఉందని నేరస్తులు రెచ్చిపోతున్నారని డీకే అరుణ విమర్శించారు.
ఇటు మృతిపై (dead) ఆమె తండ్రి నరేందర్ (preethi father narender) మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురుది ముమ్మాటికీ హత్యేనని తెలిపారు. ఈ రోజు ఆయన తెలంగాణ డీజీపీ కార్యాలయానికి (dgp office) వచ్చారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని అంజనీకుమార్ను (anjani kumar) కోరతామని చెప్పారు. మట్టూవాడా పోలీసులు (police) నిన్న తమ ఇంటికి వచ్చి విచారించారని మీడియాకు నరేందర్ (narender) చెప్పారు. మరోసారి స్టేట్మెంట్ (statement) రికార్డ్ చేశారని వివరించారు.
టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదని.. వచ్చిన చనిపోయిన విషయం స్పష్టత రాదని చెప్పారు. టాక్సికాలజీ కోసం అప్పుడే ఎక్కించిన రక్తం (blood) తీసుకున్నారని తెలిపారు. దీంతో సరయిన రిపోర్ట్ (report) రాదని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజున ఎంజీఎంలో (mgm) నమూనా తీసుకొని ఉంటే టాక్సికాలజీ రిపోర్ట్ సరైన ఫలితం వచ్చేదని నరేందర్ (narender) అభిప్రాయపడ్డారు.