»Preethi Case Ragging Committee Said Saif Emotionally Abused To Preethi Report Send To Delhi
Anti Ragging Committee: ప్రీతిని సైఫ్ మానసికంగా వేధించాడు..ఢిల్లీకి నివేదిక
వరంగల్(Warangal) కేఎంసీ(KMC) మెడికల్ విద్యార్థిని ప్రీతి(Preethi)ని సైఫ్(saif) మానసికంగా వేధించాడని కాకతీయ మెడికల్ కాలేజీ(kakatiya medical college)లో సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ(anti ragging committee) బుధవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆ నివేదికను ఢిల్లీలోని యూజీసీతోపాటు ఎన్ఎంసీకి కూడా అందజేస్తామని కేఎంసీ ప్రిన్సిపల్ మెహన్ దాస్ వెల్లడించారు. ఆ తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
వరంగల్(Warangal) కేఎంసీ(KMC) మెడికల్ విద్యార్థిని ప్రీతిని(Preethi) సైఫ్(saif) మానసికంగా వేధించాడని కాకతీయ మెడికల్ కాలేజీ(kakatiya medical college)లో సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ(anti ragging committee) బుధవారం వెల్లడించింది. కేఎంసీ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ అధ్యక్షతన సహా 13 మంది సభ్యుల సమక్ష్యంలో చర్చించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రీతి సూసైడ్ చేసుకునేందుకు గల కారణాలపై సమీక్షించారు. ఈ క్రమంలో సైఫ్ తోపాటు ప్రీతి ఎన్ని రోజులు రాత్రి విధుల్లో ఉంది? ప్రీతికి కౌన్సిలింగ్ ఇచ్చిన వైద్యులు ఎవరు? ప్రీతి, సైఫ్ కు మధ్య గొడవలకు కారణాలు ఏంటి? అనే అంశాలపై చర్చించారు.
గత సంవత్సరం నవంబర్ 18న ప్రీతి కేఎంసీ(KMC) కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది. అయితే సైఫ్, ప్రీతి మధ్య వాట్సాప్(whatsapp) గ్రూపుల్లో హేళన చేస్తూ కామెంట్ చేసిన పోస్టులను కూడా కమిటీ గుర్తించింది. ప్రీతి అనస్తీషియా రిపోర్ట్(report) విషయంలో వివాదం కూడా గొడవకు కారణం అన్నట్లుగా తెలిపింది. ఆ తర్వాత ప్రీతి, సైఫ్ కు కౌన్సిలింగ్ ఇచ్చిన అనస్తీషియా విభాగం హెచ్ఓడీ(HOD) నాగార్జున రాడ్డిని పలిచి కమిటీ పలు వివరాలు ఆరా తీసింది. ప్రీతి ఏడుస్తూ సైఫ్(saif) వేధిస్తున్నాడని తెలిపిందని హెచ్ఓడీ(HOD) చెప్పాడు. ఆ క్రమంలో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పద్దతిగా ఉండాలని చెప్పినట్లు హెచ్ఓడీ చెప్పారు. అంతేకాదు ఆ తర్వాత కూడా ప్రీతిని సైఫ్ వేధించినట్లు కమిటీ స్పష్టం చేసింది. ఇది ర్యాగింగ్ పరిధిలోకే వస్తుందని వెల్లడించింది. ఈ క్రమంలో ఈ నివేదికను ఢిల్లీలోని యూజీసీతోపాటు ఎన్ఎంసీకి కూడా అందజేస్తామని కేఎంసీ ప్రిన్సిపల్ మెహన్ దాస్(divvela mohandas) తెలిపారు.
జనగామ జిల్లాలోని కొడకొండ్ల మండలం గిర్నితండాకు చెందిన మెడికో విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తన సీనియర్ సైఫ్ (Saif) వేధింపుల కారణంగా బలైన విషయం తెలిసిందే. ఆమె మృతిని ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ప్రీతి (Preethi) ధైర్యవంతురాలు. సైఫ్ వంటి వారు వేధిస్తే మిగతా జూనియర్లు భయపడి మౌనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ప్రీతి వారిని నిలదీయడంతో, సైఫ్ (Saif) టార్గెట్ చేశాడు. ఇదే విషయం ప్రీతి తల్లిదండ్రుల(parents)కు కూడా తన బాధను చెప్పుకుంది. యాజమాన్యంతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ, నిందితుడి తీరు మారలేదు. ఇలాంటి తరుణంలో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసి, ఐదు రోజుల పాటు హాస్పిటల్ లో చికిత్స పొంది, చివరకు కన్నుమూసింది.
అయితే తన కూతురు అంత భయస్తురాలు కాదని, ఆమె ఆత్మహత్యాయత్నం చేయదని, ఎవరో బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చి ఉంటారని, సైఫ్ ను పూర్తిగా విచారిస్తే తేలుతుందని తల్లిదండ్రులు అంటున్నారు. నైట్ డ్యూటీలో, తన చెల్లిని హైదరాబాద్ తరలించినప్పుడు ఏం జరిగిందో తెలియాలని ప్రీతి (Preethi) సోదరి డిమాండ్ చేశారు. తోటి డాక్టర్లను (Doctor) లేదా విద్యార్థులను వేధించేవారు సమాజానికి ఏం మేలు చేస్తారని ఆమె నిలదీశారు. వేధింపులకు పాల్పడిన నిందితుడు సైఫ్ ను (Saif) కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.