»Bhupalpally Sp Surender Reddy Said Section 144 In Bhupalpally For A Week From Tomorrow Dont Come Out
SP Surender Reddy: భూపాలపల్లిలో రేపటి నుంచి వారం పాటు 144 సెక్షన్..బయటకు రావొద్దు!
భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలో రేపటి నుంచి వారం పాటు 144 సెక్షన్(144 Section) అమల్లో ఉంటుందని అక్కడి జిల్లా ఎస్పీ జె.సురేందర్ రెడ్డి(sp surender reddy) ప్రకటించారు. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు సహా ప్రజలు కూడా సమన్వయం పాటించాలని కోరారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మంగళవారం రేవంత్ రెడ్డి సభ జరిగిన క్రమంలో పలువురు గుడ్లతో దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవలు చెలరేగాయి.
రేపటి నుంచి వారం రోజులపాటు(one week) భూపాలపల్లి(Bhupalpally) పట్టణంలో 144 సెక్షన్(144 Section) అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ జె.సురేందర్ రెడ్డి(sp surender reddy) పేర్కొన్నారు. జిల్లాలో రాజకీయ పార్టీలు సమన్వయం పాటించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ విధమైన ప్రదర్శనలు చేయరాదని వెల్లడించారు. ఈ క్రమంలో గుంపులు, గుంపులుగా ఎవరూ గుమి గూడవద్దని, జన జీవనానికి ఇబ్బంది కలిగించ వద్దని ఎస్పీ అన్నారు. అంతేకాదు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాజకీయ పార్టీల నాయకుల సవాళ్లకు, బహిరంగ చర్చలకు పోలీసు శాఖ అనుమతి లేదని ఎస్పీ సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి జిల్లా ఎస్పీ వెల్లడించారు. ముందస్తుగా రేపు(గురువారం) భూపాలపల్లి పట్టణంలో 144 సెక్షన్(144 Section)విధించడం జరిగిందని అనవసరంగా ఎవరూ బయటకి రాకూడదని సూచించారు.
అయితే భూపాలపల్లిలో మంగళవారం టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) సభ జరిగిన నేపథ్యంలో రేవంత్ పై పలువురు బీఆర్ఎస్(BRS) నేతలు గుడ్లతో దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దాడులకు దిగారు. దీంతో భూపాలపల్లిలో కాంగ్రెస్(congress), బీఆర్ఎస్ పార్టీల మధ్య గొడవల నేపథ్యంలో రెండూ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తల మీద ఎస్పీ(SP) కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలో మళ్లీ గొడవలు జరగకుండా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా బహిరంగ ప్రదేశంలో ఎలాంటి చర్చలకు అనుమతి లేదని సురేందర్ రెడ్డి(surender reddy) తెలిపారు. ఇంకోవైపు జిల్లా కేంద్రానికి నలుమూలల నుంచి ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం రావచ్చని..అలాంటి వారికి ఇబ్బంది కలిగించ వద్దని రాజకీయ పార్టీలకి ఎస్పీ(SP) సూచించారు. అంతే కాదు రేపు నిర్వహించనున్న బహిరంగ చర్చ కార్యక్రమాన్ని విరమించుకోవాలని రాజకీయ నేతలను కోరారు. ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని వదిలేది లేదని హెచ్చరించారు. చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటారమని సురేందర్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు.