Medico Preethi : మెడికల్ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు ముగిసాయి. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలోని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
మెడికల్ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు ముగిసాయి. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలోని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. తండ్రి నరేందర్ ప్రీతి మృతదేహానికి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. కాగా మెడికో ప్రీతి మృతితో తెలుగు రాష్ట్రాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోవటం ప్రీతి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేసింది.
ఈ ఉదయం 4.15 గంటలకు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం పనులు ముగిసిన తర్వాత అంబులెన్స్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు వరంగల్ కు బయలుదేరారు. ప్రీతి మృతదేహం ఉన్న అంబులెన్స్ కు భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.
ప్రీతి మరణంతో శోక సంద్రంలో మునిగిపోయారు తండ్రి నరేందర్. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. హెచ్ఓడీని సైతం సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. సస్పెండ్ చేస్తేనే ప్రీతి ఆత్మకు శాంతి చేకూరుతుందని వారు డిమాండ్ చేస్తున్నారు. సైఫే తన కూతురికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడని ఆరోపిస్తున్నారు. కాగా నిజా నిజాలు తెలియాల్సి ఉంది.