Preethi : సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృత్యువుతో పోరాడిన ప్రీతి తుదిశ్వాన విడిచిన విషయం తెలిసిందే. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ప్రీతి కి న్యాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్ వరంగల్ సీపీ రంగనాథ్‌ను ఆదేశించారు. ఆమె కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు.
సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృత్యువుతో పోరాడిన ప్రీతి తుదిశ్వాన విడిచిన విషయం తెలిసిందే. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ప్రీతి కి న్యాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్ వరంగల్ సీపీ రంగనాథ్‌ను ఆదేశించారు. ఆమె కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు.
ప్రీతి ఘటనలో నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దంటూ కేటీఆర్ ఆదేశించారు. ప్రీతి మృతి ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ప్రీతి ఘటనలో ఉన్నవారు ఎంతటివారైనా వొదిలే ప్రసక్తి లేదన్నారు.
గతంలో కూడా ప్రీతి కేసుపై కేటీఆర్ స్పందించారు. ప్రీతి ఘటనను రాజకీయం చేస్తున్నారని తప్పుబట్టారు. తప్పు చేసిన వారు సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవరినీ వదలమని కేటీఆర్ హెచ్చరించారు. ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.20 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రీతి కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు.