»Doctor Preeti Father Narender Meets Warangal Cp Ranganath
Medico Preethi : నా బిడ్డది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం: ప్రీతి తండ్రి
ప్రీతిది ఆత్మహత్యేనని తాను నమ్ముతున్నట్లు తండ్రి నరేందర్(Narendar) తెలిపాడు. సిరంజి దొరికిందని, ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిందని సీపీ చెప్పారన్నారు. కానీ, పోస్టుమార్టం రిపోర్ట్ చూపించలేదన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నామని ఛార్జ్‌షీట్(Charge sheet)లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్(Principal), హెచ్ఓడీ(HOD)ల బాధ్యతారాహిత్యం ఉందనుకుంటున్నామని ప్రీతి తండ్రి నరేందర్ అనుమానం వ్యక్తం చేశారు.
Medico Preethi : మెడికో ప్రీతి(Medico Preethi) మరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రీతి మృతి కేసులో స్పష్టత వచ్చింది. ప్రీతిది ఆత్మహత్యాగా పోలీసులు నిర్దారించారు. పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా ఈ కేసును నిర్ధారించామని పోలీసులు వెల్లడించారు. ఇటీవల వరంగల్ సీపీ(Warangal CP)నీ ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ కలిశారు. మెడికో ప్రీతిది ఆత్మహత్యగా పోలీసులు ప్రకటించడంతో సీపీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రీతి తండ్రి నరేందర్ మీడియా(Media)తో మాట్లాడుతూ సీపీతో మాట్లాడి అనుమానాలను తేటతెల్లం చేసుకున్నారు. ఈ సందర్బంలోనే ప్రీతిది ఆత్మహత్యేనని తాను నమ్ముతున్నట్లు తండ్రి నరేందర్(Narendar) తెలిపాడు. సిరంజి దొరికిందని, ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిందని సీపీ చెప్పారన్నారు. కానీ, పోస్టుమార్టం రిపోర్ట్ చూపించలేదన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నామని ఛార్జ్‌షీట్(Charge sheet)లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్(Principal), హెచ్ఓడీ(HOD)ల బాధ్యతారాహిత్యం ఉందనుకుంటున్నామని ప్రీతి తండ్రి నరేందర్ అనుమానం వ్యక్తం చేశారు.
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ప్రీతి ఫిబ్రవరి 22న ఎంజీఎం(MGM)లో అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి వైద్యులు వెంటనే చికిత్స అందించారు. ఆమె పరిస్థితి క్షిణించడంతో హుటాహుటిన నిమ్స్(NIMS)కు తరలించారు. అక్కడ ఆమె ట్రీట్మెంట్ పొందుతూ 26వ తేదీన చనిపోయింది. తన కూతురిని సీనియర్ స్టూడెంట్ సైఫ్(Saif) అనే వ్యక్తి తనను వేధించాడని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు. తన కూతురు సైఫ్ వేధింపులు భరించలేకే చనిపోయిందని ఆరోపించారు. అంతే కాకుండా, హత్యచేసి ఉంటారనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. అయితే అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును పరిశోధన చేశారు.