ఛార్ధామ్ యాత్ర(Chardham Yatra) వేడుకగా ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ యాాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా యమునోత్రి(Yamunotri)లో పవిత్ర పూజలు చేశారు. యమునోత్రి, గంగోత్రి(Gangotri) ఆలయాల ప్రాంగణం భక్తులతో కిటకిటలాడాయి. 25వ తేదీన కేదార్నాథ్(Kedaarnaadh) అలాగే 27వ తేదీన బద్రీనాథ్(Badrinaadh) ఆలయాలను తెరువనున్నారు.
యాత్ర(Yatra)లో భాగంగా హరిద్వార్ నుంచి యాత్రికులు యమునోత్రి(Yamunotri)కి వెళ్లనున్నారు. డెహ్రాడూన్, ముస్సోరీల మీదుగా జానకిఛట్టి వరకూ వాహనాలు వెళ్లనున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి 8 కిలోమీటర్లు యమున జన్మస్థలం అయిన యమునోత్రికి యాత్రికులు చేరుకోనున్నారు. చార్ధామ్ యాత్రకు సంబంధించి అన్ని జిల్లాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఛార్ధామ్ యాత్ర(Chardham Yatra)కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అయితే రిజిస్ట్రేషన్(Registration) ప్రక్రియలో మాత్రం మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈసారి నాలుగు ధాముల్లోనూ రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేశారు. యాత్రికుల ప్రయాణ మార్గాల్లో వైద్యశాలలు, తాగునీటి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. యాత్ర(Yatra) మార్గాల్లో పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.