గంగా పుష్కరాల(Ganga Pushkaralu)కు వెళ్లాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే(Railway) గుడ్న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 22వ తేది నుంచి మే 5వ తేది వరకూ ఈ గంగా పుష్కరాలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల(Telugu states) నుంచి వెళ్లే వారికి రైల్వే ప్రత్యేక రైళ్ల(Special Trains)ను ప్రకటించింది. సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు నుంచి మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే నడపనుంది.
గంగా పుష్కరాల(Ganga Pushkaralu) సందర్భంగా సికింద్రాబాద్ నుంచి రక్సోల్ వరకూ 07007 నంబర్ ప్రత్యేక రైలు(Special Train)ను రైల్వే నడపనుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ అక్కడి నుంచి వారణాసి చేరుకుని రక్సోల్ వెళ్తుంది. ఏప్రిల్ 23, 30, మే7వ తేదీల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఆదివారం రాత్రి 10.30 గంటలకు ఇది సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది.
తిరుపతి నుంచి దానాపూర్ మీదుగా 07419 నంబర్ రైలును దక్షిణ మధ్య రైల్వే(Railway) ప్రకటించింది. ఈ ట్రైన్ తిరుపతి నుంచి ప్రయాగ్ రాజ్ అక్కడి నుంచి వారణాసి చేరుకుని దానాపూర్ వెళ్లనుంది. ఇది ఏప్రిల్ 22, 29, మే6వ తేదీల్లో తిరుపతి నుంచి బయల్దేరనుంది.
గుంటూరు నుంచి బెనారస్ మీదుగా 07230 రైలును దక్షిణ మధ్య రైల్వే(Railway) నడపనున్నట్లు తెలిపింది. ఈ రైలు గుంటూరు నుంచి ప్రయాగ్ రాజ్ మీదుగా బెనారస్ చేరుకుంటుంది. ఏప్రిల్ 22, 29, మే 6వ తేదీల్లో ఈ రైలును నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. గంగా పుష్కరాల(Ganga Pushkaralu)కు వెళ్లే వారికి ఈ ప్రత్యేక ట్రైన్ల(Special Trains)ను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.