South Central Railway Special Trains : హోలీ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో 18 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ఏర్పాటు చేసింది. వీటికి సంబంధించిన తేదీలు, సమయాల వివరాలను వెల్లడించింది. మార్చి 16వ తేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు పలు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. ఆ వివరాల పట్టికను ఒక ప్రకటన ద్వారా వెలువరించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
అలాగే తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్లకు అదనపు స్టాపేజీలను కూడా ఇస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రామేశ్వరం-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, హౌరా-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా రాజమండ్రి రైల్వే స్టేషన్లో స్టాపేజ్ కల్పించారు. అలాగే స్టాపేజీలు కల్పించిన మిగిలిన స్టేషన్లు, రైళ్ల వివరాలు ఇక్కడున్నాయి.
హుబ్లీ – మైసూర్ – హంపి ఎక్స్ ప్రెస్ – అనంతపురం స్టేషన్.
సికింద్రాబాద్ రేపల్లె ఎక్స్ ప్రెస్ – సిరిపురం.
కాజీపేట -బలార్ష ఎక్స్ ప్రెస్ – రాఘవపురం.
కాజీపేట – బలార్ష ఎక్స్ ప్రెస్ – మందమర్రి స్టేషన్.
పూణె – కాజీపేట ఎక్స్ ప్రెస్ – మంచిర్యాల.
దౌండ్ – నిజామాబాద్ ఎక్స్ ప్రెస్ – నవీపేట్.
తిరుపతి – ఆదిలాబాద్ – కృష్ణా ఎక్స్ ప్రెస్ – మేడ్చల్ స్టేషన్.
భద్రాచలం – సింగరేణి ఎక్స్ ప్రెస్ – బేతంపూడి స్టేషన్.
నర్సాపూర్ – నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ – మహబూబాబాద్ స్టేషన్.
సికింద్రాబాద్ – తిరుపతి – వందేభారత్ ఎక్స్ ప్రెస్ – మిర్యాలగూడ స్టేషన్.
సికింద్రాబాద్ – భద్రాచలం – కాకతీయ ఎక్స్ ప్రెస్ – తడకలపుడి.
రేపల్లె – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ – రామన్నపేట.
గుంటూరు – సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ – ఉంద నగర్.
కాజీపేట్ – బలార్ష ఎక్స్ ప్రెస్ – Rechni Road, తాండూరు.
తిరుపతి – సికింద్రాబాద్ – పద్మావతి ఎక్స్ ప్రెస్ – నెక్కొండ స్టేషన్.
భద్రాచలం రోడ్డు – సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ ప్రెస్ – బేతంపుడి.