Mla నన్నపునేని నరేందర్‌కు కొండా సురేఖ వార్నింగ్.. కారు ఆపి.. సిగ్గులేదా అంటూ..
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీతో కలిసి పనిచేస్తావా..? సిగ్గు లేదా అని ధ్వజమెత్తారు.
Konda Surekha: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు రోడ్డు మీదే వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి, కాంగ్రెస్ కొండా సురేఖ (Konda Surekha). కారులో ఉన్న ఆయనకు తనదైన శైలిలో హెచ్చరికలు జారీచేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
అసలు ఏం జరిగిందంటే..
వరంగల్ పెరుకవాడ ప్రభుత్వ పాఠశాల వద్ద గల పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల దాడిలో గాయపడ్డ కార్యకర్తలను కూతురు సుష్మిత పటేల్‌తో కలిసి కొండా సురేఖ (Konda Surekha) పరామర్శించారు. అక్కడ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కనిపించారు. ఆయన వద్దకెళ్లిన కొండా సురేఖ (Konda Surekha).. ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రదీప్ రావుతో కలిసి పోవడానికి సిగ్గు లేదా అని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తాయా అని ధ్వజమెత్తారు. అందుకోసం తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తారా అని ఫైరయ్యారు. ఈ స్థాయికి ఎవరు తీసుకొచ్చారో తెలియదా అని కొండా సుష్మిత పటేల్ మండిపడ్డారు.
పక్కనే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త కొండా సురేఖతో (Konda Surekha) మాట్లాడుతూ చేయి లేపగా ఇంకా పీక్‌కి చేరింది. కొండా సురేఖ ఎమ్మెల్యే వద్దకు వచ్చి.. భయపెట్టుడు, బెదిరించుడు చేస్తే బాగుండదని ఫైరయ్యారు. తమ పార్టీ కార్యకర్తలను ఎందుకు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అక్కడి నుంచి కారు వెళ్లే పరిస్థితి లేదు. సో.. ఎమ్మెల్యే నరేందర్ నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఘటనపై సీపీకి ఫిర్యాదు చేస్తానని అంటూ వెళ్లారు. ఓ ఎమ్మెల్యేను కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ (Konda Surekha) బెదిరించడం కలకలం రేపింది. ఆ వీడియోలో ఎప్పుడూ అక్క.. తాము ప్రచారం చేయలేదని నరేందర్ చెబుతోన్న కొండా సురేఖ (Konda Surekha) వినిపించుకోలేదు.