BRS leaders met the Speaker to disqualify MLA Danam Nagender
Danam Nagender: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) ఇటీవల పార్టీ మారిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ లీడర్లు ఆగ్రహించారు. పార్టీ మారడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు కలిసి, అనర్హత వేటు వేయాలని తమ విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలలలోపు అనర్హత వేటు వేయొచ్చు అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని పార్టీ మారిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేసిన ఘటనను ఉటంకించారు.
ఖైరాతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో పాలనలో ఉన్న కాంగ్రెస్ గూటికి వెళ్లాడని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. కాంగ్రెస్కు బయపడి అందులోకి వెళ్లాల్సిన అవసరం లేదని, అవినీతి చేసిన వారే అధికారంలో ఉన్న పార్టీలో ఉండాలనుకుంటారు అని ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా చాలా మంది ఎమ్మల్యేలు తమ పార్టీలోకి వస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి సైతం చెప్పడం విశేషం. మరీ సభాపతి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని శాసన సభ స్పీకర్ ను ఆయన నివాసంలో కలిసి పిటిషన్ ను సమర్పించిన బీఆర్ఎస్ శాసనసభా పక్ష బృందం. pic.twitter.com/jf8VhU3rcR