ఈరోజు జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభ జరిగింది. ఈ సభలో మోదీ పాల్గొని.. ఆరంభంలో తెలుగులో ప్రసంగించారు. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారభమైందని మోదీ అన్నారు.
PM Modi: ఈరోజు జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభ జరిగింది. ఈ సభలో మోదీ పాల్గొని.. ఆరంభంలో తెలుగులో ప్రసంగించారు. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారభమైందని మోదీ అన్నారు. దేశం అభివృద్ధి చెందితేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు పెరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడురోజుల్లో తెలంగాణకు రావరడం ఇది రెండోసారి. రాష్ట్రంలో బీజేపీ పెరుగుతోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా 400లకు పైగా సీట్లు రావడం ఖాయమని మోదీ తెలిపారు.
నేను భరతమాత పూజారిని.. తెలంగాణ, ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల. ఇక్కడి ప్రజలను బీఆర్ఎస్ దోచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని తన ఏటీఎంగా మార్చుకుందని మోదీ అన్నారు. బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తోంది. తెలంగాణ డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోందని మోదీ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మోదీ అన్నారు. దేశంలో ఏ దోపిడీలోనైనా దాని వెనుక కుటంబ పార్టీలే ఉన్నాయని మోదీ అన్నారు.