»High Court Notices To Khairatabad Mla Danam Nagender
Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభ పెట్టారని, ఆయన సతీమణి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదంటూ విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేసి, దానం ఎన్నికను రద్దు చేయాలని కోరారు.
Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టారని బీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ విజయసేన్ రెడ్డి, విజయారెడ్డి తరఫున సుంకర నరేశ్ వాదనలు విన్నారు. ఎన్నికల్లో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టారని, దీనికి సంబంధించి పోలీసు స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దానం నాగేందర్ తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని తెలిపారు. వాదానలు విన్న కోర్టు దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.
బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిసిన దానం నాగేందర్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో అదే పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి రెండు పర్యాయాలు గెలిచారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు రాకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారు. దాంతో ఆయన పదవిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు లోక్ సభ స్వీకర్‌కు వినతి పత్రం ఇచ్చారు.