»Kcr Family Cheated The God Anjanna Tpcc Chief Revanth Reddy
kcr family ఆ దేవుడిని కూడా వదల్లేదు: Revanth reddy
Revanth reddy on kcr family:సీఎం కేసీఆర్ (cm kcr).. ఆయన కుటుంబం (family) ఆ దేవుడిని (god) కూడా వదల్లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) అన్నారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్దిలో ముసుగులో మరొకరు దేవుడిని కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి (revanth reddy) సోమవారం చొప్పదండిలో (choppadandi) హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించారు.
kcr family cheated the god anjanna tpcc chief Revanth reddy
Revanth reddy on kcr family:సీఎం కేసీఆర్ (cm kcr).. ఆయన కుటుంబం (family) ఆ దేవుడిని (god) కూడా వదల్లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) అన్నారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్దిలో ముసుగులో మరొకరు దేవుడిని కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి (revanth reddy) సోమవారం చొప్పదండిలో (choppadandi) హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించారు. అక్కడినుంచి కొండగట్టు (kondagattu) మీదుగా పాదయాత్ర సాగుతుంది. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి రూ.500 కోట్లను (rs.500 crores) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ (cm kcr) కొండగట్టులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ నిధుల (funds) విడుదల ఆలస్యం చేయొద్దని కోరారు. అబద్దపు వాగ్దానాలతో పూజారులు, భక్తులనే కాక కొండగట్టు అజంన్నను కూడా కేసీఆర్ (kcr) మోసం (cheat) చేశారని ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవిత (kavitha) హనుమాన్ చాలీసా పారాయణ చేసి.. 125 అడుగులు (125 foor statue) విగ్రహాం కట్టిస్తానని మసం చేసిందని మండిపడ్డారు.
ఘన చరిత్ర కలిగిన కొండగట్టు (kondagattu) ఆలయాన్ని భక్తులకు ఇబ్బంది కలుగకుండా అభివృద్ది చేయాలని రేవంత్ రెడ్డి (revanth reddy) తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 800 ఎకరాల (800 acres) అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కాపాడాలని కోరారు. కొండగట్టును సీఎం కేసీఆర్ (kcr) అభివృద్ధి చేస్తారనే నమ్మకం తమకు లేదని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డెవలప్ చేస్తుందని వివరించారు.
కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి (revanth reddy) డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా ఆర్థిక సాయం చేశారని ఆరోపించారు. ప్రమాదం జరిగిన చోట గోడ (wall) కట్టారని.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రేవంత్ రెడ్డి (revanth reddy) అన్నారు. ఆ కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం (telangana government) ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రేవంత్ రెడ్డి (revanth reddy) పాదయాత్రకు జనం నుంచి విశేష స్పందన వస్తోంది. ఇటీవల తన పాదయాత్రలో భద్రత గురించి రేవంత్ హైకోర్టును (high court) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ విచారణ ఈ రోజు జరగనుంది. మరోవైపు మొన్న (శనివారం) రోజున రేవంత్ రెడ్డి (revanth reddy) కాన్వాయ్ వాహనాలు ఢీ కొన్నాయి. నాలుగైదు కార్లు ఢీకొనగా.. మీడియా మిత్రులు గాయపడ్డ సంగతి తెలిసిందే.