preethiది హత్యేనంటున్న తండ్రి నరేందర్.. డీజీపీతో భేటీ
preethi father narender:ప్రీతి (preethi) మృతిపై (dead) ఆమె తండ్రి నరేందర్ (preethi father narender) మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురిది ముమ్మాటికీ హత్యేనని తెలిపారు. ఈ రోజు ఆయన తెలంగాణ డీజీపీ కార్యాలయానికి (dgp office) వచ్చారు. అంజనీకుమార్ను (anjani kumar) కలిసి సమగ్ర విచారణ జరిపించాలని కోరతామని చెప్పారు.
preethi father narender:ప్రీతి (preethi) మృతిపై (dead) ఆమె తండ్రి నరేందర్ (preethi father narender) మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురిది ముమ్మాటికీ హత్యేనని తెలిపారు. ఈ రోజు ఆయన తెలంగాణ డీజీపీ కార్యాలయానికి (dgp office) వచ్చారు. అంజనీకుమార్ను (anjani kumar) కలిసి సమగ్ర విచారణ జరిపించాలని కోరతామని చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరతామని ఆయన చెప్పారు. తమకు టాక్సికాలజీ రిపోర్ట్ అందలేదని చెప్పారు.
మట్టూవాడా పోలీసులు (police) నిన్న తమ ఇంటికి వచ్చి విచారించారని మీడియాకు నరేందర్ (narender) చెప్పారు. మరోసారి స్టేట్మెంట్ (statement) రికార్డ్ చేశారని వివరించారు. టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదని.. వచ్చిన చనిపోయిన విషయం స్పష్టత రాదని చెప్పారు. టాక్సికాలజీ కోసం అప్పుడే ఎక్కించిన రక్తం (blood) తీసుకున్నారని తెలిపారు. దీంతో సరయిన రిపోర్ట్ (report) రాదని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజున ఎంజీఎంలో (mgm) నమూనా తీసుకొని ఉంటే టాక్సికాలజీ రిపోర్ట్ సరైన ఫలితం వచ్చేదని నరేందర్ (narender) అభిప్రాయపడ్డారు.
ఎంజీఎం ఆస్పత్రిలో (mgm hospital) ప్రీతి (preethi) అపస్మారక స్థితిలో పడి ఉన్న చోట.. మిడాజోలం, పెంటానోల్ అనే మత్తు ఇంజెక్షన్ (injection) వయల్స్ పడి ఉన్నాయి. ఆమె శరీరంలో ఆ మందుల అవశేషాలు ఉన్నాయో తెలుసుకునేందుకు హైదరాబాద్ వైద్యులు (doctor) నమూనా సేకరించి టాక్సికాలజీ పరీక్ష కోసం పంపించారు. ఆ నివేదిక ఆదివారం వరంగల్ పోలీసులకు (warangal police) చేరింది. ప్రీతి శరీరం నుంచి సేకరించిన నమూనాల్లో ఎలాంటి రసాయనాలు కనిపించలేదని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో ప్రీతి (preethi) మరణంపై క్లారిటీ రావడం లేదు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే హత్యకు గురయ్యారా అనే అంశంపై స్పష్టత రావడం లేదు.
ప్రీతి (preethi) పేరంట్స్ మాత్రం ఆమెది ముమ్మాటికీ హత్యేనని చెబుతున్నారు. హత్య చేశారని.. నిందితులపై (culprits) కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు డీజీపీని (dgp) కలువడానికి వచ్చారు. మరోవైపు ప్రధాన నిందితుడు సైఫ్ (saif) ఫోన్ కాల్ డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముగ్గురు నుంచి నలుగురు (four) నిందితులు ఉంటారని ప్రీతి సోదరి ఆరోపించారు. తన అక్కను వారు వేధించారని ఇదివరకే మీడియాకు తెలిపింది. రాత్రి 11 గంటల వరకు డ్యూటీ వేసే వారని.. టాయిలెట్లకు (toilets) తాళం వేసేవారని చెప్పింది.