కోనసీమ: ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామం శివారు లో కోడి పందాల స్థావరాలపై పోలీసులు ఆదివారం మెరుపు దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై రాము తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడిలో 10 మంది పందెం రాయుళ్ళును అదుపులోకి తీసుకున్నారు. 40 పందెం పుంజులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.