RR: మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌకుంట్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేసినట్లు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. అధికారులు సైతం భద్రతను ఏర్పాటు చేశారన్నారు.