తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ (Warangal) మెడికో ప్రీతి కేసులో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) అధికారిపై వేటు పడింది. కేఎంసీ అనస్థీషియా హెచ్ఓవీ నాగార్జున రెడ్డి (Nagarjuna Reddy)బదిలీ అయ్యారు. కేఎంసీ నుంచి భూపాలపల్లికి బదిలీ అయ్యారు. ఈ మేరకు వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ ప్రీతి కేసులో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ (Warangal) మెడికో ప్రీతి కేసులో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) అధికారిపై వేటు పడింది. కేఎంసీ అనస్థీషియా హెచ్ఓవీ నాగార్జున రెడ్డి (Nagarjuna Reddy)బదిలీ అయ్యారు. కేఎంసీ నుంచి భూపాలపల్లికి బదిలీ అయ్యారు. ఈ మేరకు వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ ప్రీతి కేసులో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఎంజీఎం అనస్థీషియా హెచ్ఓడీ (HOD) నాగార్జున రెడ్డిని బాధ్యుడిగా చేస్తూ అతడిపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికో ప్రీతి ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నాగార్జున రెడ్డి.విధుల్లో అతడి నిర్లక్ష్యం వల్లే ప్రీతి ఘటనకు ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు.
మొదటి నుంచి కూడా ప్రీతి తల్లిదండ్రులు, ఆమె సోదరుడు అంతా కూడా నాగార్జున రెడ్డి వైపే వేలు చూపిస్తున్నారు. నాగార్జున రెడ్డి అసమర్థ వ్యవహార శైలి వల్లే ప్రీతికి ఇలా జరిగిందని మొదట్నుంచి కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. ఆ మేరకు నివేదిక అందుకున్న ప్రభుత్వం నాగార్జున రెడ్డిపై బదిలీ వేటు వేసింది.మరోవైపు.. ఈ కేసులో నిందితుడిగా భావిస్తోన్న సైఫ్‌ను (Saif) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు ర్యాగింగ్ యాక్ట్ (Raging Ac)tకింద కేసులు నమోదు చేశారు. కాగా.. మట్టేవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్డు అనుమతించగా.. సైఫ్‌ను విచారించి కీలక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.