MissShettyMrPolishetty: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫస్ట్ లుక్ అదుర్స్
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మేరకు మేకర్స్ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరోయిన్ అనుష్క, హీరో నవీన్ పోలిశెట్టి క్రేజీగా కనిపిస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంలో అభిమానుల్లో మరింత ఆసక్తి మొదలైంది.
క్రేజీ కాంబోలో వస్తున్న హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ అనుష్క నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(MissShettyMrPolishetty) చిత్రం నుంచి ఫస్ట్ లుక్(first look) విడుదలైంది. అత్యంత ఇష్టమైన కాంబోను పరిచయం చేస్తున్నామని ఈ మేరకు యూవీ క్రియేషన్స్(uv creations) ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ సమ్మర్లో రోలర్ కోస్టర్ రైడ్ కోసం సిద్ధంగా ఉండాలని తెలిపింది. ఇక ఈ పోస్టర్లో నవీన్ పోలిశెట్టి(naveen polishetty) వెనుక హైదరాబాద్ హైటెక్ సిటీ ఉండగా..అనుష్క(anushka shetty) వెనుక లండన్ క్లాక్ టవర్ ఉండటం గమనించవచ్చు. అంతేకాదు అనుష్క చేతిలో హ్యాప్పీ సింగిల్ అని రాసి ఉన్న పుస్తకం పట్టుకుని ఉండగా..పగటి కలలు కనేవాడిగా నవీన్ టీ షర్టుపై రెడీ టూ మింగిల్ అని కోటేషన్ ఉంది. ఇవి చూస్తుంటే ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరుగుతుంది.
ఇక ఈ చిత్రానికి పీ మహేష్ బాబు(mahesh babu p) దర్శకత్వం వహిస్తుండగా..యూవీ క్రియేషన్స్(uv creations) నిర్మించింది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దిశగా ఈ మూవీ శరవేగంగా కొనసాగుతుంది. ఈ సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పోస్టర్లు చూస్తే తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో కూడా విడుదల చేయనున్నారు.
నవీన్ పొలిశెట్టి 2021లో యాక్ట్ చేసిన జాతి రత్నాలు(jathi ratnalu) మూవీ తర్వాత వస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇక అనుష్క శెట్టి(anushka shetty) నటిస్తున్న 48వ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ మూవీలో అనుష్క ‘అన్విత రవళి శెట్టి’గా నటించింది. దాదాపు 4 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ బుల్లితెరపైకి వచ్చింది. 2018లో థియేటర్లలో విడుదలైన భాగమతి అనుష్క చివరి చిత్రం. అనుష్క శెట్టి ఈ చిత్రంలో తన పాత్ర కోసం బరువు పెరిగనట్లు తెలుస్తోంది.
Presenting the first look of our film #MissShettyMrPolishetty 😊It’s been a while since I have seen u guys, only because we were working to bring u the best possible entertainment in theatres. Looking forward to the madness again in theatres this Summer 2023. Love you guys ❤️ pic.twitter.com/KzRS2ButSn
— Naveen Polishetty (@NaveenPolishety) March 1, 2023
టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్‌ను షేర్ చేస్తూ నవీన్ ట్వీట్ చేస్తూ “మా చిత్రం #MissShettyMrPolishetty ఫస్ట్ లుక్‌ని అందిస్తున్నాను. నేను మిమ్మల్ని చూసి చాలా కాలం అయ్యింది. ఎందుకంటే మేము మీకు థియేటర్లలో అత్యుత్తమ వినోదాన్ని అందించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నాడు. ఈ వేసవి(summer) 2023లో థియేటర్లలో మళ్లీ మ్యాడ్ నెస్ కోసం ఎదురు చూస్తున్నానని లవ్ యూ గాయ్స్ అని ప్రకటించాడు.