ATP: స్వర్ణాంధ – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. శుభ్రతపై ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ చెత్త సేకరణ వాహనాలు వస్తున్నాయని, తడి, పొడి చెత్తను వేరుచేసి వారికి ఇవ్వాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా చీపురి పట్టి రహదారిని ఊడ్చారు.