PLD: నరసరావుపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలు, వ్యాపారస్థులు సహకరించాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు కోరారు. శనివారం పట్టణంలోని 18వ వార్డులో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని కోరారు.