ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ తీరు వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలు పక్కన పడేసి మతపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ముందే అభివృద్ధిలో వెనుకబడిన గోషామహల్ పై దృష్టి సారించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు పాలయ్యాడు.
నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) గత ఐదేళ్లలో ఐదు ప్రాంతాల్లో గృహాల(houses)ను కొనుగోలు చేసిన వార్తలపై స్పందించారు. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. కానీ అదే వార్త నిజమైతే బాగుండని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజా సింగ్ ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇతర వర్గాలను కించపరుస్తూ, దూషిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. తన సోషల్ మీడియా ద్వారా ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. దీనికి ప్రభుత్వం స్పందించి అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఒక ఎమ్మెల్యేపై పీడీ చట్టం ప్రయోగించడం బహుశా దేశంలో మొదటిసారి కావొచ్చు.
నందమూరి కుటుంబానికి (Nandamuri Family) రోడ్డు ప్రమాద గండం ఉందని కనిపిస్తోంది. ఈ కుటుంబసభ్యులు తరచూ రోడ్డు ప్రమాదాలకు (Road Accident) గురవుతున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో ఇప్పటికే నందమూరి కుటుంబం చాలా విషాదాలు ఎదుర్కొన్నది.
అమెరికా ఫైటర్ జెట్-22 అలాస్కా మీదుగా ఎత్తుగా ఎగురుతున్న గుర్తు తెలియని ఓ వస్తువును కూల్చివేసిందని వైట్ హౌస్ శుక్రవారం తెలిపింది. 40,000 అడుగుల ఎత్తులో తేలుతున్నందున అది పౌర విమానయానానికి ముప్పుగా పరిణమించినందున ఆ వస్తువును కూల్చివేశామని వెల్లడించారు.
Janasena Party : చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు.... జనసేనలో చేరబోతున్నారా..? అవుననే ప్రచారమే జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రచారం ఊపందుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. జనసేన పార్టీ ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో కనిపించడమే దీనికి కారణం కావడం గమనార్హం.
భారత్‌లో భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందా ? అంటే అందుకు కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జావేద్ మాలిక్ అవుననే అంటున్నారు. మరి ఎక్కడ వచ్చే అవకాశం ఉందో ఓసారి చుద్దాం.
Turkey Earth Quake : టర్కీ భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. 25వేల మందికి పైగా ఈ భూకంప ధాటికి ప్రాణాలు కోల్పోయారు. భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. వేల మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు.
ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడంతో మరి సురేశ్ బాబు, రానా హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో అధికారులు స్పీడు పెంచారు. వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఏపీ YSRCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
టర్కీ-సిరియాలో తీవ్ర భూకంపం సంభవించి 100 గంటల తర్వాత కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు ఇరు దేశాల్లో కలిపి 24 వేల మందికిపైగా మరణించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
Bread Maangoge, Chuha Denge': ఇంట్లోకి ఎవైనా కావాలంటే షాప్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంట్లో కూర్చొని ఫోన్ లో నొక్కితే చాలు... 15-20 నిమిషాల్లో ఆర్డర్ చేసిన సరుకులన్నీ కళ్లముందుకు వచ్చేస్తాయి. ఇలా సరుకులు డెలివరీ చేసే యాప్స్ చాలానే ఉన్నాయి. అందులో బ్లింక్ ఇట్ కూడా. కాగా... ప్రస్తుతం ఈ బ్లింక్ ఇట్ యాప్ నుంచి ఆర్డర్ చేసిన ఓ ఫుడ్ ఐటెమ్ వివాదానికి కారణమైంది. ఓ వ్యక్తి ఈ యాప్ లో బ్రె...
ఈనెల 17వ తేదీన తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.
కొంత ట్రాఫిక్ కష్టాలు ఉన్నప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే హైదరాబాద్ కే మంచి పేరు. కొన్నింటి కోసం కొన్ని తిప్పలు తప్పవంటూ కొందరు ఈ రేసును ఆహ్వానిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రపంచ క్రీడ సంబరానికి వేదికగా నిలుస్తుండడంతో హైదరాబాద్ వాసులు భారీ స్వాగతం పలుకుతున్నారు.
ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు ఉన్నాయని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్ కేతిరెడ్డి అన్నారు. వాటి పరిష్కారం కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ధరిణితో సమస్యలు లేవని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ప్రభుత్వానికి సవాల్ చేశారు. లేదంటే మీరు ఏం చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.