కొత్తగా జే ట్యాక్స్ (J Tax) అనే వాటికి భయపడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని వ్యాపారులు తెలిపారు. కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగ యువత హైదరాబాద్ (Hyderabad), బెంగళూరుకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలు, అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం జరిగిన పరిణామాలపై ‘జగనాసుర రక్తచరిత్ర’ పేరిట పుస్తకం తీసుకువచ్చింది. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే దానిపై సవివరంగా పుస్తకం రూపొందించినట్లు తెలిపారు.
MP Asaduddin Owaisi : తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగానే దేశంలో కూడా సుపరిపాలన అందిస్తారని అన్నారు. తెలంగాణలో ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారని కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నార...
Revanth Reddy : ప్రగతి భవన్ పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్... డీజీపీకి ఫిర్యాదు చేసింది. కాగా... దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. తనపై ఫిర్యాదు చేసిన గులాబీ నేతలకు కౌంటర్ గా ఆయన కూడా డీజీపీకి కంప్లయింట్ చేశారు.
నారా లోకేష్ అతి కష్టంగా పాదయాత్ర చేయడం చూస్తుంటే తనకు చాలా బాధ వేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ ను ముంబయి వర్లీలోని త్రీ సిక్స్టీ వెస్ట్‌లో వ్యాపార వేత్త వెల్స్పన్ గ్రూప్ అధినేత B K గోయెంకా 240 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు
పోడు భూముల (podu lands) అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) శుక్రవారం అసెంబ్లీలో (Assembly) కీలక ప్రకటన చేశారు. గిరిజనులు ముందుకు వస్తే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
దేశంలో గత 11 ఏళ్లలో 16 లక్షల 60 వేల మంది భారతీయులు తమ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు జై శంకర్ రాజ్యసభలో తెలిపారు. ఆప్ పార్టీ ఎమ్మెల్యే రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
వివాహ విందులో పన్నీరు లేదని వరుడి బంధువు ఒకరు ఘర్షణకు దిగారు వధువు తరఫువారితో. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పట్ జిల్లాలో బుధవారం చోటు చేసుకున్నది.
ఇస్రో శుక్రవారం ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ప్రయోగించిన రాకెట్ sslv-d2 సక్సెస్ అయ్యింది.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య నెలకొన్న వివాదం ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) వద్దకు వెళ్లింది. ఇరువురి మధ్య కొద్ది రోజులుగా విభేదాలు బాహాటంగానే కనిపిస్తున్నాయి.
కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా యాహూ (Yahoo) కూడా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు (Layoff) సిద్ధమైంది. తమ మొత్తం వర్క్ ఫోర్స్‌లో 20 శాతానికి పైగా తొలగించే అవకాశాలు ఉన్నాయని యాహూ గురువారం షాకింగ్ న్యూస్ చెప్పింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
వచ్చే వారం ఎన్నికలు జరిగే త్రిపుర మేనిఫెస్టోను గురువారం పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో కలిసి విడుదల చేశారు. పేదలకు 5 రూపాయలకే మీల్స్, విద్యార్థినులకు బైక్స్ వంటి ఎన్నో హామీలను ఇచ్చింది. రూ.5 మీల్స్‌ను రోజుకు మూడుసార్లు ఏర్పాటు చేయనున్నట్లు నడ్డా చెప్పారు.
హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా పలు రకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అవే ఏంటో ఇప్పుడు చుద్దాం.