»Medico Preethi Kavitha Writes Open Letter To Medicos Parents
Medico Preethi: ప్రీతి తల్లిదండ్రులకు కవిత బహిరంగ లేఖ
సైఫ్ (saif) అనే ఉన్మాది ఘాతుకానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తల్లిదండ్రులకు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
సైఫ్ (saif) అనే ఉన్మాది ఘాతుకానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తల్లిదండ్రులకు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
లేఖలో ఏముందంటే… ‘సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక తల్లిగా నేను ఎంతో వేదనకు గురయ్యాను. ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేను ఒకరిని.
ఎన్నో కష్టాలకు ఓర్చి పీజీ విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతున్నాను. చదువుకొని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.
కడుపు కోతను అనుభవిస్తున్న మీకు (తల్లిదండ్రులు) ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది.
మీ కుటుంబానికి సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం మరియు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదు అని మీకు నేను హామీ ఇస్తున్నాను. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
యావత్తు రాష్ట్ర ప్రజలు మీ వెంట ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని లేఖ రాశారు.
నిన్న మంత్రి కేటీఆర్ కూడా ప్రీతి కేసులో దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందుతులు అది సైఫ్ కానీ, సంజయ్ కానీ ఎవరైనా వదిలి పెట్టడమన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అన్యాయం చేసిన వాడు ఎవడైనా వదిలి పెట్టమని.. చట్టం, న్యాయం పరంగా శిక్షిస్తామని తేల్చిచెప్పారు.
అంతకుముందు, ప్రీతి వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు కాళోజీ యూనివర్సిటీకి రాజ్ భవన్ లేఖ రాశారు. ప్రీతిని వరంగల్ ఎంజీఎం నుంచి నిమ్స్ కు తరలించడంతో ఎంతో విలువైన సమయం కోల్పోయినట్టయిందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. అలాకాకుండా, ప్రీతిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనే ఉంచి, హైదరాబాద్ నుండి నిపుణులైన వైద్యులను, వైద్య పరికరాలను అక్కడికే తరలించి ఉంటే బాగుండేదన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్, వేధింపులకు సంబంధించిన ఎస్ఓపీలపై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని వర్సిటీని ఆదేశించారు. వైద్య కళాశాలల్లో మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పని గంటల వివరాలతో పాటు మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరు తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.