నెటిజన్లు ప్రీతి మృతికి సంతాపం తెలుపుతూ, ఆమెకు న్యాయం చేయాలంటూ '#JusticeForDrPreethi' అంటూ ట్వీట్ చేస్తున్నారు. భారత సమాజం ఆమెకు న్యాయం జరగాలని ఎంతలా కోరుకుంటుందంటే... అందుకు '#JusticeForDrPreethi' టాప్ ట్రెండింగ్ లో నిలవడమే నిదర్శనం.
జనగామ జిల్లాలోని కొడకొండ్ల మండలం గిర్నితండాకు చెందిన మెడికో విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తన సీనియర్ సైఫ్ (Saif) వేధింపుల కారణంగా బలైన విషయం తెలిసిందే. ఆమె మృతిని ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ప్రీతి (Preethi) ధైర్యవంతురాలు. సైఫ్ వంటి వారు వేధిస్తే మిగతా జూనియర్లు భయపడి మౌనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ప్రీతి వారిని నిలదీయడంతో, సైఫ్ (Saif) టార్గెట్ చేశాడు. గత మూడు నాలుగు నెలలుగా పదేపదే వేధించడంతో పాటు వాట్సాప్ గ్రూప్ లలోను ఆమెపై పోస్టులు పెట్టాడు. అలా తనను టార్గెట్ చేయవద్దని ఆమె చెప్పినప్పటికీ సైఫ్ వినలేదు. మరింత రెచ్చిపోయాడు. తల్లిదండ్రులకు కూడా తన బాధను చెప్పుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ, నిందితుడి తీరు మారలేదు. ఇలాంటి తరుణంలో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసి, ఐదు రోజుల పాటు హాస్పిటల్ లో చికిత్స పొంది, చివరకు కన్నుమూశారు. అయితే తన కూతురు అంత భయస్తురాలు కాదని, ఆమె ఆత్మహత్యాయత్నం చేయదని, ఎవరో బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చి ఉంటారని, సైఫ్ ను పూర్తిగా విచారిస్తే తేలుతుందని తల్లిదండ్రులు అంటున్నారు.
ప్రీతి మృతి యావత్ భారత్ ను (India) ఆందోళనకు గురి చేసింది. మెడికల్ కాలేజీలో (Medical College) ఇలాంటి వేధింపులను జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రీతికి (Preethi) న్యాయం జరగాలని, సైఫ్ ను (Saif) కఠినంగా శిక్షించాలని ఆయా పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నెటిజన్లు ప్రీతి మృతికి సంతాపం తెలుపుతూ, ఆమెకు న్యాయం చేయాలంటూ ‘#JusticeForDrPreethi’ అంటూ ట్వీట్ చేస్తున్నారు. భారత సమాజం ఆమెకు న్యాయం జరగాలని ఎంతలా కోరుకుంటుందంటే… అందుకు ‘#JusticeForDrPreethi’ టాప్ ట్రెండింగ్ లో నిలవడమే నిదర్శనం.
ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు నటుడు రానా (Rana) నటించిన లీడర్ (Leader) సినిమాలోని డైలాగ్ ను ట్వీట్ చేస్తున్నారు. ‘ఒక అమాయకురాలైన ఆడపిల్లకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత.. ఊడితే ఎంత శర్మ గారు… చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం.. ఇది కాదండీ ప్రజలు కోరుకునేది.. లక్షల కోట్లు, కొన్ని ప్రాజెక్టులు, ఇంత బియ్యం, ఇంత కరెంట్ కాదండీ.. మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు… విధానాల్లో మార్పు.. రాజకీయాల్లో మార్పు’ అంటూ సినిమా డైలాగ్ తో ప్రభుత్వాన్ని న్యాయం కోసం ప్రశ్నిస్తున్నారు. సైఫ్ ను బహిరంగంగా ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
నైట్ డ్యూటీలో, తన చెల్లిని హైదరాబాద్ తరలించినప్పుడు ఏం జరిగిందో తెలియాలని ప్రీతి (Preethi) సోదరి డిమాండ్ చేసారు. తోటి డాక్టర్లను (Doctor) లేదా విద్యార్థులను వేధించేవారు సమాజానికి ఏం మేలు చేస్తారని ఆమె నిలదీశారు. వేధింపులకు పాల్పడిన నిందితుడు సైఫ్ ను (Saif) కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.
తన కూతురు ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని తండ్రి నరేందర్ ఆరోపించారు. ప్రీతికి ఎవరో ఇంజెక్షన్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె అంత ధైర్యవంతురాలని చెప్పారు. ప్రీతికి ఎవరో ఇంజెక్షన్ ఇచ్చారనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేయాలాని విజ్ఞప్తి చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీ అనస్థీషియా డిపార్టుమెంట్ హెచ్ఓడీని సస్పెండ్ చేసిన తర్వాతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడే తన కూతురు మృతికి సంబంధించిన అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. డ్యూటీలో ఉన్న తన కూతురును కాపాడలేని ఈ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం అంటూ ప్రీతి తల్లి కన్నీరు మున్నీరు అయ్యారు.