నటుడు నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యానికిి ఏం అయిందని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
Narayana Murthy: నటుడు నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆర్ నారాయణ మూర్తి అంటే తెలియని తెలుగువారుండరు. ఆయన ఒక సినిమా నటుడే కాదు.. నిర్మాత, దర్శకుడు అంతే కాదు.. ఆయన నటించిన సినిమాలకు పాటలు, మాటలు అందించిన రచయిత కూడా. ఆయన చిత్రాలు ప్రజల్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. సమాజంలోని సంఘటనలు, సమస్యలను అల్లుకొని సినిమాలు తెరకెక్కిస్తుంటారు. అందుకే ఆయన్ను పిపుల్స్ యాక్టర్ అంటారు.
గత కొంత కాలంగా నారాయణ మూర్తి నుంచి పెద్దగా సినిమాలు రావడం లేదు. ఆయన ఏదైనా చిత్రంలో నటించాలంటే ఆయనే లీడ్ రోల్లో ఉండాలి అనే నియమం పెట్టున్నారు. అందుకే టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి వేసిన మూర్తి వేషాన్ని వదులుకున్నారు. ఆయన సినిమాలే కాదు వ్యక్తి కూడా చాలి సింపుల్గా ఉంటారు. ఆయన జీవన విధానం కూడా ఒక సామాన్య మానవుడిలా ఉంటుంది. ఎక్కడ కనిపించినా కర్శకుడిలా, కార్మికుడిలా వైట్ అండ్ వైట్లో కనిపిస్తారు. ఈ మధ్య రాజకార్ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించారు. స్వతహాగా కమ్యూనిస్ట్ భావాలు కలిగిన ఆయన హనుమంతుడు ఎవరి సొత్తు కాదు, భారతీయుల సొత్తు అని ఆవేశంగా మాట్లాడారు. ఆయన చిత్రాలే కాదు ఆయన వ్యాఖ్యలు కూడా తీవ్రంగా అంతే సూటిగా ఉంటాయి. సామాజిక అంశాలనే కథా వస్తుగా మలుచుకొని.. సమాజాన్ని నిత్యం తట్టిలేపే చిత్రాలు తీస్తుంటారు. త్వరగా కొలుకొని మరో ఆలోచింపజేసే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.